Smartwatches Offer : అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. రెడ్‌మి, నాయిస్, ఇతర స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
Smartwatches Offer : స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌వాచ్‌లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి..

Smartwatches Offer
Smartwatches Offer : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల సందర్భంగా అనేక స్మార్ట్‌వాచ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను (Smartwatches Offer) ఆఫర్ చేస్తోంది. మీరు కొత్త స్మార్ట్‌వాచ్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్, నాయిస్ పల్స్ గో బజ్, ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో మాక్స్, బౌల్ట్ ట్రైల్ ప్రో, బోట్ వేవ్ కాల్ 2 ప్లస్‌లపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో బ్యాంక్ డిస్కౌంట్లు, ధర తగ్గింపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లపై డీల్స్, ధరలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బోట్ వేవ్ కాల్ 2 ప్లస్ :
అమెజాన్‌లో బోట్ వేవ్ కాల్ 2 ప్లస్ ధర రూ.1,049కు పొందవచ్చు. బోట్ వేవ్ కాల్ 2 ప్లస్ 1.96-అంగుళాల హైడెఫినిషన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌లో వాయిస్ అసిస్టెంట్, యానిమేటెడ్ వాచ్ ఫేస్‌లు, 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్ ఉన్నాయి.
ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో మాక్స్ :
అమెజాన్‌లో ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో మాక్స్ స్మార్ట్‌వాచ్ రూ.1,099కి లిస్ట్ అయింది. ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో మాక్స్ డిస్‌ప్లే 2.01 అంగుళాలు ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్‌తో 120 కన్నా ఎక్కువ వాచ్ ఫేస్‌లు, హెల్త్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
నాయిస్ పల్స్ గో బజ్ :
ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్‌లో నాయిస్ పల్స్ గో బజ్ ధర రూ. 1,099కు లభిస్తోంది. నాయిస్ పల్స్ గో బజ్‌లోని TFT డిస్‌ప్లే 1.69 అంగుళాలు. SpO2, ఆటో డిటెక్షన్‌తో కూడిన 100 స్పోర్ట్స్ మోడ్‌లు, అడ్వాన్స్ బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ ఛార్జ్‌తో వాచ్ బ్యాటరీ 7 రోజుల వరకు వస్తుంది. ఫోన్ కాల్స్‌తో మాత్రమే రెండు రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది.
బౌల్ట్ ట్రైల్ ప్రో :
అమెజాన్‌లో బౌల్ట్ ట్రైల్ ప్రో స్మార్ట్‌వాచ్ రూ.1,599కి లిస్ట్ అయింది. బౌల్ట్ ట్రైల్ ప్రోలోని 2.01-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే 600 నిట్స్ ప్రకాశాన్ని కలిగి ఉంది. ఈ వాచ్‌లో 120+ స్పోర్ట్స్ మోడ్‌లు, 250+ వాచ్‌ఫేస్‌లు, SpO2, ఏఐ వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్ కాలింగ్ ఉన్నాయి.