Vivo V60 5G Launch : వివో లవర్స్ మీకోసమే.. ఈ నెల 12నే కొత్త వివో V60 5G లాంచ్.. ఖతర్నాక్ ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo V60 5G Launch : వివో నుంచి సరికొత్త V60 ఫోన్ రాబోతుంది. స్టయిలీష్ డిజైన్, పవర్‌ఫుల్ బ్యాటరీ, కెమెరా ఫీచర్లతో రాబోతుంది. ఫుల్ డిటెయిల్స్..

Vivo V60 Launch
Vivo V60 5G Launch : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. వివో నుంచి మరో కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి రాబోతుంది. కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V60 5Gని ఆగస్టు 12, 2025న మధ్యాహ్నం 12 గంటలకు (Vivo V60 5G Launch) లాంచ్ చేయనుంది.
ఈ వివో ఫోన్ చూసేందుకు అద్భుతంగా ఉంది. ఫీచర్లు కూడా బాగున్నాయి. ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పొచ్చు. అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ, ప్రీమియం డిజైన్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే వివో V60 అద్భుతమైన ఆప్షన్. వివో V60 5G ఫోన్ డీల్ ఎలా పొందాలంటే?
డిజైన్, డిస్‌ప్లే :
వివో V60 ఫోన్ డిజైన్ చాలా స్లిమ్, స్టైలిష్‌గా ఉంది. కర్వడ్ ఎడ్జ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గోల్డ్, బ్లూ, గ్రే అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే ప్రీమియం లుక్ ఉంటుంది. క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌ను కూడా ఉంది.
పర్ఫార్మెన్స్, బ్యాటరీ :
ఈ వివో ఫోన్‌లో కొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు సరైనది. వివో V60లో 6,500mAh పెద్ద బ్యాటరీ ఉంది. రోజంతా ఛార్జింగ్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. తద్వారా ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. మీరు ఛార్జింగ్ కోసం మళ్లీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు.
కెమెరా, ఫోటోగ్రఫీ :
మీరు ఫొటోగ్రఫీని ఇష్టపడితే.. వివో V60 అద్భుతమైన ఆప్షన్. ZEISS ట్యూన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. గ్రూప్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. కెమెరా మల్టీఫోకల్ పోర్ట్రెయిట్, AI మోడ్, 100x జూమ్ వంటి చాలా స్మార్ట్ ఫీచర్‌లను కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్, స్మార్ట్ ఫీచర్లు :
వివో V60 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది. ఈసారి గూగుల్ జెమిని ఏఐ కూడా ఉంది. తద్వారా వాయిస్ కమాండ్‌లతో ఫోన్‌ను ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఫోన్ కాల్ ఆటో ఆన్సర్ చేయొచ్చు. IP68, IP69 రేటింగ్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్‌లో తడిసినా కూడా చెక్కు చెదరదు.
ధర (అంచనా) :
భారత మార్కెట్లో వివో V60 ధర సుమారు రూ. 37వేల నుంచి రూ. 40వేల వరకు ఉంటుంది. ఈ ఫోన్ మిడ్-రేంజ్ కేటగిరీలో వస్తుంది. ఫీచర్లు చూస్తే ప్రీమియం ఫోన్ మాదిరిగానే ఉంటాయి. లాంచ్ తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు చోట్ల కొనుగోలు చేయవచ్చు. కెమెరా, బ్యాటరీ, డిజైన్, స్మార్ట్ ఫీచర్ల పరంగా బెస్ట్ ఫోన్. వివో V60 ఆగస్టు 12న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.