Celebrities Costly Bikes: ఎంఎస్ ధోనీ నుంచి మాధవన్ వరకూ సెలబ్రిటీలు లక్షలు పోసి కొనుక్కున్న బైక్‌లివే..
ఎంఎస్ ధోనీ లాంటి బైక్ లవర్స్ లక్షలు పోసి బైక్ ను సొంతం చేసుకుంటారు. ఎంఎస్ ధోనీ నుంచి జాన్ అబ్రహం వరకూ కాస్ట్లీ బైక్ లపై మీరూ ఓ లుక్కేయండి..
- Subhan Ali Shaik
- Published On : September 4, 2021 / 02:19 PM IST
Costly Bikes
Celebrities Costly Bikes: బైక్స్ అనేవి చాలా థ్రిల్లింగ్ మెషీన్లు. యువత చాలా మందికి జాబ్ రాగానే చేసే పని బైక్ కొనుక్కోవడం. ఖరీదు ఎంత అని పక్కకుపెట్టి మనకు నచ్చిందేంటి అనే వెదుకుతారు. కామన్ మ్యాన్ థింకింగ్ ఇలా ఉంటే.. సెలబ్రిటీలు ఏ రేంజ్ బైక్ లు వాడతారో అని డౌట్ వస్తుందా.. ఔను. ఎంఎస్ ధోనీ లాంటి బైక్ లవర్స్ లక్షలు పోసి బైక్ ను సొంతం చేసుకుంటారు. ఎంఎస్ ధోనీ నుంచి జాన్ అబ్రహం వరకూ కాస్ట్లీ బైక్ లపై మీరూ ఓ లుక్కేయండి..
MS Dhoni – Confederate Hellcat X132
Ms Dhoni
ఎంఎస్ ధోనీ దగ్గరున్న బైక్ లలో Kawasaki Ninja H2 లాంటి దానితో కలిపి రూ.35కోట్ల విలువైనవి గ్యారేజిలో పెట్టుకున్నాడు. అందులో ఒకటే ఈ Hellcat X132. దీని ధర రూ.47లక్షలు.
John Abraham – Yamaha VMax 60th anniversary special
బైక్ లవర్స్ లిస్ట్ లో జాన్ అబ్రహం పేరు లేదంటే అది కంప్లీట్ అయినట్లు కాదు. అతని కలెక్షన్ లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ Yamaha VMax 1700 cc. దీని ధర రూ.25లక్షలు.
R Madhavan – Indian Roadmaster
కన్నుల విందు చేస్తున్న ఇండియన్ రోడ్ మాస్టర్ బైక్ ఆర్ మాధవన్ కలెక్షన్లలో ఒకటి. ఈ బైక్ తో లాంగ్ టూర్ లు ఎంచక్కా తిరిగేస్తానంటున్నాడు మాధవన్. దీని ధర రూ. 40లక్షలు.
Vivek Oberoi – Ducati 1098
Viveka Oberai
హాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ కూడా మోటార్ సైకిల్స్ అంటే క్రేజ్. ఇతని గ్యారేజిలో ఉన్న ఎల్లో కలర్ డ్యూకాటీ 1098 చూపుతిప్పుకోనివ్వదంటే నమ్మండి. దీని ధర రూ.7నుంచి 60లక్షల మధ్యలో ఉంటుంది.
