Netflix India launches wireless earbuds, headphones and more audio products
Netflix India : ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix India) నుంచి కొత్త ప్రొడక్టులు భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకించి Netflix కంపెనీ boAt సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నాయిస్ క్యాన్సిలింగ్ సపోర్ట్ ఉన్న ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS), హెడ్‌ఫోన్‌లు, వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌తో సహా లిమిటెడ్ ఎడిషన్ ఆడియో వేరబుల్స్‌ను లాంచ్ చేస్తుంది.
ఈ నెట్‌ఫ్లిక్స్-బ్రాండెడ్ ప్రొడక్టులన్నీ డిసెంబర్ 20 నుంచి అందుబాటులో ఉంటాయి. boAt X నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ ఎడిషన్‌లో మూడు లిమిట్-ఎడిషన్ డివైజ్‌లు ఉన్నాయి. అందులో boAt Nirvana 751ANC, Airdopes 411ANC, Rockerz 333 Pro ఉన్నాయి. ఈ ఆడియో ప్రొడక్టులు ప్రస్తుతం అడ్వాన్స్ ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ డివైజ్ సేల్ డిసెంబర్ 20, మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.
ఆసక్తి గల కస్టమర్‌లు boAt X నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ ఎడిషన్ డివైజ్‌లను కొనుగోలు చేసేందుకు boAt వెబ్‌సైట్, Amazon, Flipkart, Myntra వంటి ఈ-కామర్స్ సైట్‌లను విజిట్ చేయవచ్చు. రెండు కంపెనీలు సేల్స్‌లో భాగంగా స్పెషల్ డీల్స్ ప్రకటించాయి.
Netflix India launches wireless earbuds, headphones and more audio products
boAt X Netflix స్ట్రీమ్ ఎడిషన్ ప్రొడక్టుల ప్రారంభ కొనుగోలుదారులు boAt, Netflix నుంచి అద్భుతమైన ప్రొడక్టులను గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఇప్పుడు, ప్రొడక్టు వివరాలకు సంబంధించి 3 కొత్త Netflix, boAt ఆడియో ప్రొడక్టులను ఓసారి చూద్దాం..
boAt Nirvana 751ANC : ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు 40mm డ్రైవర్‌లతో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు (33 dB వరకు) సపోర్టు ఇస్తుంది. హెడ్‌ఫోన్‌లు 65 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తాయి. దీని ధర రూ. 3,999గా ఉంటుంది.
Netflix India launches wireless earbuds, headphones and more audio products
boAt Airdopes 411ANC : ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్‌లు ANCకి (25 dB వరకు) సపోర్టు అందిస్తాయి. 10mm డ్రైవర్‌లను అందిస్తాయి. ఈ డివైజ్ స్పష్టమైన కాల్స్, gesture కంట్రోల్స్, 17.5 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ కోసం ENx టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. BoAt Airdopes 411ANC ఇయర్‌బడ్స్ ధర రూ. 2,999గా ఉండనుంది.
Rockers 333 Pro : ఈ నెక్‌బ్యాండ్‌లో 10mm డ్రైవర్లు, ENx టెక్నాలజీ ఉన్నాయి. 60 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. 20 గంటల ప్లేబ్యాక్ సమయానికి సపోర్టు ఇస్తుంది. ఈ ప్రొడక్టు ధర రూ.1,699గా ఉండనుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..