New AI Model _ Scientists develop AI model that can read human mind using technology similar to ChatGPT
New AI Model : ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చాట్‌జీపీటీ, న్యూ బింగ్, గూగుల్ బార్డ్ ఏఐ అంటూ కొత్త ఏఐ టూల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. మనుషులు చేయాల్సిన పనులను క్షణాల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నాయి. కొత్త ఏఐ టెక్నాలజీతో మనుషుల మనుగడే ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది. టెక్ కంపెనీలు సైతం మనుషులను తొలగించి వారి స్థానంలో ఏఐ టూల్స్ రోల్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదే.. కృత్రిమ మేధస్సుగా (artificial intelligence) పేరొందిన ఏఐ టెక్నాలజీతో ప్రపంచంలో రాబోయే తరాలకు మరిన్ని అవకాశాలను అందించనుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో ChatGPT, New Bing, Google’s Bard వంటి చాట్‌బాట్‌లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రస్తుత రోజుల్లో AI స్పేస్‌పై ప్రతిఒక్కరిలో ఆసక్తి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నిజంగా కొత్త కాన్సెప్ట్ కానప్పటికీ (ఎన్నో సంవత్సరాలుగా ఈ ఏఐ టూల్స్ ఏదో రకంగా వినియోగిస్తూనే ఉన్నారు) దీనిపై కచ్చితమైన అవగాహనతో పాటు ఆసక్తిని కలిగి ఉండటంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : Godfather of AI: ఏఐ ఛాట్‌బాట్స్ వల్ల పెను ప్రమాదం: కృత్రిమ మేధకు గాడ్‌ఫాదర్‌లాంటి హింటన్ వార్నింగ్
అలాంటి ఏఐ టెక్నాలజీతో రెండు నెలల కిందటే అసాధ్యమనిపించిన పనులు కూడా వాస్తవ రూపం దాల్చాయి. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి మానవ ఆలోచనలను డీకోడ్ చేయగల సామర్థ్యం వాటిలో ఒకటి. లేటెస్ట్ రిపోర్టులప్రకారం.. ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్శిటీ సైంటిస్టులు సాధ్యంకాని పనిని సుసాధ్యం చేశారు. మానవ ఆలోచనలను టెక్స్ట్‌గా మార్చడంలో విజయం సాధించారు. కంప్యూటర్ సైన్స్ డాక్టోరల్ విద్యార్థి జెర్రీ టాంగ్, న్యూరోసైన్స్, కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలెక్స్ హుత్ నేతృత్వంలో ఈ AI అధ్యయనం జరిగింది.
AI మానవ ఆలోచనలను టెక్స్ట్‌గా మార్చగలదు :
ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (FMRI) యంత్రాన్ని ఉపయోగించి ముగ్గురి వ్యక్తుల ఆలోచనలను 16 గంటల మెదడు కార్యకలాపాలను నిశతంగా పరిశీలించారు సైంటిస్టులు. వారి వ్యక్తిగత పదాలకు అనుగుణంగా ఉండే నాడీ ఉద్దీపనలను పరిశోధకులు గుర్తించగారు. ఈ మెదడు కార్యకలాపాలను డీకోడ్ చేయడానికి, దానిని టెక్స్ట్‌గా అనువదించడానికి పరిశోధక బృందం చాట్‌జిపిటి (ChatGPT)కి సమానమైన కస్టమ్-ట్రైన్డ్ (GPT AI) మోడల్‌ను ఉపయోగించింది. అయినప్పటికీ, ఇందులో పాల్గొనేవారి కచ్చితమైన ఆలోచనలు గుర్తించలేదు. పరిశోధనలో పాల్గొనేవారు ఏమి ఆలోచిస్తున్నారో దాని సారాంశం మాత్రమే AI ద్వారా అనువదించినట్టు సైంటిస్టులు కనుగొన్నారు.
New AI Model _ Scientists develop AI model that can read human mind using technology similar to ChatGPT
అధ్యయన ఫలితాల్లో 82 శాతం వరకు కచ్చితత్వంతో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెదడులోని ఆలోచనలను గుర్తించి డీకోడింగ్ చేయడంలో AI మోడల్ 72-82 శాతం కచ్చితమైనదిగా తేలింది. అయితే ఊహాజనిత ప్రసంగాన్ని డీకోడింగ్ చేయడంలో కచ్చితత్వం దాదాపు 41-74 శాతం మాత్రమే. సైలెంట్ మూవీల వివరణలలో కూడా కచ్చితత్వం 21-45 శాతం వరకు ఉంటుంది. ఫలితాలు నేచర్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ అధ్యయనం ఎలాంటి మెదడు ఇంప్లాంట్ల సాయం లేకుండానే జరిగింది. ‘నాన్వాసివ్ మెథడ్ ద్వారా ఇంతకుముందు చేసిన దానితో పోలిస్తే ఒక ముందడుగు అని చెప్పవచ్చు. సాధారణంగా ఒకే పదాలు లేదా చిన్న వాక్యాలను సులభంగా గుర్తించింది. సంక్లిష్టమైన ఆలోచనలతో ఎక్కువ కాలం పాటు నిరంతర భాషను డీకోడ్ చేసే మోడల్‌ను కలిగి ఉన్నామని యూటీ టెక్సాస్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన రిపోర్టులో హుత్ పేర్కొన్నారు.
ఏఐ అభివృద్ధిపై సైంటిస్టుల ఆందోళన :
టెక్సాస్ యూనివర్శిటీలోని సైంటిస్టులు సైతం ఏఐ అభివృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టెక్నాలజీతో శారీరకంగా తమను తాము వ్యక్తీకరించుకోలేని వ్యక్తులకు సాయం చేసేందుకు సాధ్యమవుతుందని చెప్పారు. తమ మనస్సులోని భావాలను బయటకు చెప్పలేని వారికి ఈ ఏఐ మోడల్ అద్భుతంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. వారు ఏం ఆలోచిస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారో ఏఐ మోడల్ ద్వారా టెక్స్ట్ రూపంలో తెలుసుకోవచ్చు. అయినప్పటికీ, ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతోంది. దీన్ని క్లినికల్ సెట్టింగ్‌లో ఉపయోగించాలంటే ఇంకా ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుందని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.
New AI Model _ Scientists develop AI model that can read human mind using technology similar to ChatGPT
మరోవైపు, ఈ టెక్నాలజీ అభివృద్ధిపై సైంటిస్టులు.. తమ డీకోడర్ పనిచేయడానికి మానవ విషయాల స్వచ్ఛంద సహకారం తప్పక అవసరమని అంటున్నారు. మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను అభివృద్ధి చేసేటప్పుడు వ్యక్తుల మానసిక గోప్యతను గౌరవించాలని కూడా చెబుతున్నారు. ఈ టెక్నాలజీ దుర్వినియోగంపై కూడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లేదా సంబంధిత ఏఐ మోడల్ యజమాని నిఘా పెట్టాలని సూచించారు. లేదంటే.. ఏఐ టెక్నాలజీతో దుర్మార్గపు ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.