Online Gaming Rules : గేమర్లకు బిగ్ షాక్.. మే 1 నుంచి కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. ఉల్లంఘిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి ఫైన్..!

New Online Gaming Rules : దేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు మే 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ గేమింగ్ పరిశ్రమకు ఇప్పుడు చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయి. గేమర్ల భద్రత కోసమే ఈ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది.

New Online Gaming Rules ( Image Credit : Gemini AI )

New Online Gaming Rules : ఆన్‌లైన్ గేమర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇకపై ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్లు జర జాగ్రత్త.. ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి కొత్త రూల్స్ మే 1 నుంచి అమల్లోకి వచ్చాయి . ప్రభుత్వ ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ 2026’ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త గేమింగ్ రూల్స్ అతిక్రమిస్తే ఏకంగా మూడేళ్లు జైలు శిక్ష ఉంటుంది. అలాగే కోట్లలో జరిమానాలు చెల్లించక తప్పదు.

ముఖ్యంగా డబ్బులు చెల్లించే బెట్టింగ్ ఆన్‌లైన్ గేమ్‌లపై కేంద్ర ప్రభుత్వం కీలక చట్టం తీసుకొచ్చింది. గేమింగ్ ఇండస్ట్రీని పారదర్శకంగా మార్చడమే కాకుండా గేమర్‌లకు సేఫ్ డిజిటల్ ప్లాట్‌ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త గేమింగ్ నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్ గేమింగ్‌ను మూడు భాగాలుగా విభజించారు. మనీ గేమ్‌లు ఇప్పుడు పూర్తిగా నిషేధం. ఇంతకీ ఆన్ లైన్ గేమర్లపై ఈ కొత్త నిబంధనల ప్రభావం ఎంతవరకు ఉంటుందో వివరంగా తెలుసుకుందాం..

కొత్త ఆన్‌లైన్ గేమింగ్ నిబంధనలేంటి? :
వినియోగదారుల భద్రతతో పాటు సేఫ్ గేమింగ్ ఇండస్ట్రీ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త నిబంధనలను రూపొందించారు. ఇప్పటి వరకు, వివిధ రాష్ట్రాలలో వేర్వేరు నిబంధనలు ఉండేవి. ఈ గందరగోళాన్ని పరిష్కరించేందుకు డబ్బు చెల్లించి ఆడే గేమ్‌లు ఇప్పుడు పూర్తిగా నిషేధించారు. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

Read Also : Smart TV Buying Guide : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఈ ఫీచర్ ఉంటేనే ఇంటికి తెచ్చుకోండి.. లేదంటే మీ డబ్బులు వృథా..!

ఆన్‌లైన్ డబ్బు చెల్లించి ఆడే గేమింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే.. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష రూ. కోటి జరిమానా విధించవచ్చు. అదేవిధంగా, డబ్బు చెల్లించి ఆడే ఆన్‌లైన్ గేమింగ్‌ను ప్రమోట్ చేస్తే.. ఐదు ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.2 కోట్ల జరిమానా విధించవచ్చు.

మూడు వర్గాలుగా గేమ్స్ :
కొత్త నిబంధనల ప్రకారం.. గేమింగ్‌ను మూడు వర్గాలుగా విభజించారు. అందులో మొదటిది ఇ-స్పోర్ట్స్.. ఇందులో పోటీగా ఆడే ప్రొఫెషనల్ గేమ్స్ ఉంటాయి. రెండోది ఆన్‌లైన్ సోషల్ గేమ్స్.. ఎంటర్‌టైన్మెంట్, లెర్నింగ్ వంటి సేఫ్ గేమ్స్ అనమాట. ఇక మూడోది ఆన్‌లైన్ మనీ గేమ్స్ ప్రస్తుతం వీటిని పూర్తిగా నిషేధించారు. అయితే, ఏ గేమ్ ఏయే వర్గంలోకి వస్తుందో నిర్ణయించే బాధ్యతను ఒక కేంద్ర అధికార సంస్థకు అప్పగించారు.

గేమర్‌లపై ఎలాంటి ప్రభావం? :
ఈ కొత్త నిబంధనలు గేమర్లను ప్రొటెక్ట్ చేస్తాయి. యూజర్ల ఏజ్ వెరిఫికేషన్, టైమ్ లిమిట్ కంట్రోల్స్, పేరెంట్ కంట్రోల్స్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తప్పనిసరి. గేమింగ్ వ్యసనాన్ని అరికడుతుంది.

యూజర్ల వయస్సు నిర్ధారణ (ఏజ్ వెరిఫికేషన్) తప్పనిసరి. తద్వారా చిన్నవారు నిషేధిత గేమ్స్‌ నుంచి దూరంగా ఉంటారు. గేమ్స్ గడిపే సమయాన్ని నియంత్రించే టైమ్ లిమిట్ కంట్రోల్స్, పిల్లల గేమింగ్‌ను మానిటరింగ్ చేసేందుకు పేరెంట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి.

ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారం కోసం ఫిర్యాదుల వ్యవస్థ ఏర్పాటును తప్పనిసరి చేశారు. ఈ చర్యలతో గేమింగ్‌పై వ్యసనం తగ్గి వినియోగదారులు సేఫ్ గేమ్స్ మాత్రమే ఆడొచ్చు.