Skoda Kushaq Launch : పండుగ సీజన్‌కు ముందే.. కొత్త స్కోడా కుషాక్ SUV, స్లావియా లిమిటెడ్ కొత్త స్పెషల్ వేరియంట్లు..!

Skoda Kushaq Launch : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. స్కోడా కొత్త లిమిటెడ్ ఎడిషన్ ట్రిమ్‌లను పండుగ సీజన్‌కు ముందు లాంచ్ చేసింది. ఏ కారు మోడల్ వేరియంట్ ధర ఎంతంటే?

  • Published On : September 4, 2023 / 10:45 PM IST

New Skoda Kushaq and Slavia limited-edition variants launched

Skoda Kushaq Launch : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India) రాబోయే పండుగ సీజన్‌కు ముందు పాపులర్ కుషాక్ SUV (Kushaq Skoda), స్లావియా సెడాన్ (Slvaia Sedan) నుంచి కొత్త స్పెషల్ ఎడిషన్లను విడుదల చేసింది. ఈ స్కొడా కుషాక్ ఇప్పుడు కొత్త ఒనిక్స్ ప్లస్ ట్రిమ్‌తో వస్తుంది.

అయితే, స్లావియా యాంబిషన్ ప్లస్ ట్రిమ్‌లో అందిస్తుంది. ఈ 2 మోడల్‌లు వార్షికోత్సవం, లావా (Lava) బ్లూ ఎడిషన్‌ల మాదిరిగానే పరిమిత కాల వ్యవధిలో అందుబాటులో ఉంటాయి. స్కోడా కుషాక్ ఒనిక్స్ ప్లస్ ఎడిషన్ స్కోడా కుషాక్ ఒనిక్స్ ఎడిషన్ ఆధారంగా రూపొందించింది. కానీ, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, విండో లైన్ క్రోమ్ గార్నిష్ రూపంలో కొన్ని అదనపు ఫీచర్లతో వస్తుంది.

Read Also : New Tata Nexon EV : కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ ఈవీ కారు వచ్చేస్తోంది.. హ్యుందాయ్, మహీంద్రా, మారుతీలకు దబ్బిడి దిబ్బిడే..!

ఫ్రంట్ గ్రిల్, టెయిల్ గేట్ కూడా క్రోమ్ డిజైన్ కలిగి ఉన్నాయి. క్యాండీ వైట్, కార్బన్ స్టీల్ కలర్ ఆప్షన్లలో మాత్రమే అందిస్తుంది. 1.0 TSI ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 115bhpని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. స్కోడా స్లావియా యాంబిషన్ ప్లస్ యాంబిషన్ ట్రిమ్‌పై ఆధారపడి ఉంటుంది. గ్రిల్, డోర్లు, బూట్ లిడ్ క్రోమ్ గార్నిష్‌ని పొందుతుంది. డ్యాష్‌క్యామ్‌తో కూడా వస్తుంది.

Skoda Kushaq Launch and Slavia limited-edition variants launched

హ్యుందాయ్ తర్వాత ఈ ఫీచర్‌ను అందించిన నాన్-లగ్జరీ సెగ్మెంట్‌లో రెండో ఆటోమేకర్‌గా నిలిచింది. ఈ ట్రిమ్ 1.0TSI మోటార్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. స్కోడా ఈ కొత్తగా ప్రవేశపెట్టిన అన్ని వేరియంట్లపై ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, ప్రత్యేక కార్పొరేట్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.

సాధారణ ఒనిక్స్ ట్రిమ్‌తో పోలిస్తే.. కుషాక్ ఒనిక్స్ ప్లస్ ధర రూ. 80వేలు, బేస్ యాక్టివ్ ట్రిమ్‌తో సమానంగా ఉంటుంది. ఇదిలా ఉంటే, సాధారణ యాంబిషన్ వేరియంట్‌లతో పోలిస్తే.. స్లావియా యాంబిషన్ ప్లస్ వేరియంట్‌లు రూ.70వేల వరకు సరసమైనవి. స్కోడా కుషాక్ ఒనిక్స్ ప్లస్ ధర రూ. 11.59 లక్షలు (ఎక్స్-షోరూమ్).

స్లావియా ఆంబిషన్ ప్లస్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 12.49 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్ (ఎక్స్-షోరూమ్) ధర రూ. 13.79 లక్షలు. అంటే.. ఒనిక్స్ ట్రిమ్‌తో పోలిస్తే.. కుషాక్ రూ. 80వేలు తక్కువగా ఉంటుంది. అయితే, స్లావియా యాంబిషన్ ప్లస్ యాంబిషన్ ట్రిమ్ కన్నా రూ. 70వేలు తక్కువగా ఉంటుంది.

Read Also : Honda Elevate SUV Launch : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ క్రెటాకు పోటీగా హోండా ఎలివేట్ SUV కారు.. 4 వేరియంట్ల ధర ఎంతంటే?