Honda Elevate SUV Launch : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ క్రెటాకు పోటీగా హోండా ఎలివేట్ SUV కారు.. 4 వేరియంట్ల ధర ఎంతంటే?

Honda Elevate SUV Launch : కొత్త కారు కొంటున్నారా? హోండా నుంచి సరికొత్త ఎలివేట్ SUV కారు వచ్చేసింది. ఈ ఎలివేట్ SUV కారు మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఏ కారు మోడల్ ధర ఎంతంటే?

Honda Elevate SUV Launch : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ క్రెటాకు పోటీగా హోండా ఎలివేట్ SUV కారు.. 4 వేరియంట్ల ధర ఎంతంటే?

Honda Elevate SUV, rival to Hyundai Creta, launched at Rs. 11 lakh

Honda Elevate SUV Launch : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా (Honda) నుంచి కొత్త ఎలివేట్ SUV (Elevate SUV) కారు వచ్చేసింది. భారత మార్కెట్లో అధికారికంగా రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. జపాన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి పోటీదారులకు పోటీగా గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. హోండా ఎలివేట్‌తో కాంపాక్ట్ SUV విభాగంలోకి ప్రవేశించింది. ఈ ఎలివేట్ SUV మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది. అందులో SV, V, VX, ZX అనే వేరియంట్లు ఉన్నాయి. టాప్-ఎండ్ వెర్షన్ ధర రూ. 16 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఎలివేట్ SUV బుకింగ్స్ గత జూలై నుంచే మొదలైంది. అయితే, సెప్టెంబర్ 4 నుంచి కస్టమర్లకు కార్ల తయారీ సంస్థ ఎలివేట్ SUV డెలివరీలను ప్రారంభించింది.

Read Also : Honda Elevate Launch : హోండా ఎలివేట్ కారు వచ్చేస్తోంది.. సెప్టెంబర్‌లోనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

భారత మార్కెట్లో ఇతర SUV కార్లకు పోటీగా ఎలివేట్‌ సేల్స్‌పైనే హోండా ఆశలు పెట్టుకుంది. CRV, BR-V, WR-V విక్రయాల సంఖ్యను పెంచడంలో విఫలమైనప్పటికీ.. హోండా ఎలివేట్‌తో మరో అడుగు ముందుకు వేసింది. ఈ కొత్త కారు బుకింగ్ నంబర్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయని కార్ల తయారీదారు వెల్లడించింది. కనీసం ఇప్పటికైనా ఎలివేట్ తన అమ్మకాలను పెంచుకోవడానికి సాయపడుతుందని భావిస్తోంది. భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఎలివేట్ ప్రత్యేకంగా గ్లోబల్ అర్బన్ SUVగా రూపొందించింది. హోండా తరువాత గ్లోబల్ మార్కెట్ల ఎలివేట్ SUVని లాంచ్ చేస్తుంది. ఆసక్తికరంగా, ఎలివేట్ SUV ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ 2026 నాటికి భారత మార్కెట్లో లాంచ్ కానుందని ఆటోమేకర్ వెల్లడించింది.

ఎలివేట్ SUV మొత్తం 7 సింగిల్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇందులో ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్‌లలో 3 డ్యూయల్-టోన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్, ప్లాటినం వైట్ పెర్ల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్, రేడియంట్ రెడ్ మెటాలిక్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్ ఉన్నాయి.

Honda Elevate SUV, rival to Hyundai Creta, launched at Rs. 11 lakh

Honda Elevate SUV, rival to Hyundai Creta, launched at Rs. 11 lakh

డిజైన్ పరంగా, ఎలివేట్ SUV బాక్సీ ఫ్రంట్ ప్రొఫైల్‌తో వస్తుంది. పెద్ద బ్లాక్ రేడియేటర్ గ్రిల్, LED హెడ్‌లైట్లు, ఇంటిగ్రేటెడ్ LED DRLs, LED టైల్‌లైట్లు, బ్లాక్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, పెద్ద వీల్ ఆర్చెస్ హౌసింగ్ స్పోర్టీ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ క్లాడింగ్‌లతో పాటు అన్ని వైపులా కనిపించే డిజైన్ కస్టమర్లను మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. SUV కారులో భారీ 220mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా పొందింది. ఈ సెగ్మెంట్‌లో ఇదే అత్యధికమని చెప్పవచ్చు. ఎలివేట్ SUV క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి అనుకూలంగా ఉండే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. 7-అంగుళాల HD కలర్ TFT డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంది.

హుడ్ కింద, ఎలివేట్ SUV 1.5-లీటర్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. అదే యూనిట్ హోండా సిటీ సెడాన్‌కు కూడా పవర్ అందిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 119bhp శక్తిని, 145.1 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, అధునాతన CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఎలివేట్ SUV మాన్యువల్ వేరియంట్లలో 15.31kmpl మైలేజీని కలిగి ఉండగా, CVT వెర్షన్లు 16.92 kmpl మైలేజీని అందిస్తాయని హోండా తెలిపింది.

Honda Elevate             SV                           V                       VX                 ZX
MT                              10,99,900         12,10,900          13,49,900       14,89,900
CVT                                   –                    13,20,900           14,59,900      15,99,900

Read Also : 2023 Honda CD110 Dream Deluxe : 2023 హోండా CD110 డ్రీమ్ డీలక్స్ వచ్చేసింది.. ఈ బైక్ ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు..!