Vi Plans: వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌లు.. ఉచితంగా ఓటీటీ సేవలు

వోడాఫోన్ ఐడియా రెండు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కష్టమర్లకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

Netflix

Vi Plans: వోడాఫోన్ ఐడియా రెండు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కష్టమర్లకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ ప్లాన్‌లలో భాగంగా ప్రముఖ ఓటీటీ సేవలను యూజర్లకు ఉచితంగా ఆఫర్‌ చేస్తున్నాయి. వోడాఫోన్‌ ఐడియా తన పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీఐ రెడ్‌ఎక్స్‌ ఫ్యామిలీ ప్లాన్ల పేరిట రెండు కొత్త పోస్ట్‌పెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్‌లను క్రియేట్ చేసింది. వీఐ రెడ్‌ఎక్స్‌ ప్లాన్‌లో భాగంగా రూ.1699, రూ.2299 ప్లాన్‌లను, ఉచితంగా ఓటీటీ కనెక్షన్లను అందిస్తున్నట్లు ప్రకటించింది.

Vi launches Rs 1,699 RedX Family plan:
Vi RedX ఫ్యామిలీ ప్లాన్ రూ.1699 ఒక నెల చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌ ముగ్గురు సభ్యులు వాడుకునే అవకాశం ఉంది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, జాతీయ రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అపరిమిత డేటా ప్రయోజనాలతో పాటు నెలకు 3వేల SMSలను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్లను ఏడాది రోజులు పొందే అవకాశం ఉంది.

Vi adds Rs 2,299 RedX Family plan:
Vi RedX Family plan రూ.2299 ఒక నెల పాటు మాత్రమే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌ ఐదుగురు సభ్యులు వాడుకునే అవకాశం ఉండగా.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, జాతీయ రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అపరిమిత డేటా ప్రయోజనాలతో పాటు నెలకు 3వేల SMSలను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్లను ఒక ఏడాది పొందవచ్చు.