Smartphones Price Hike : బాబోయ్.. భారీగా పెరగబోతున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఇప్పుడే కొనడం బెటరా..? నథింగ్ సీఈఓ ఏమన్నారంటే?

Smartphones Price Hike : మెమరీ చిప్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే నెలల్లో స్మార్ట్‌ఫోన్ ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని నథింగ్ సీఈఓ కార్ల్ పీ హెచ్చరించారు.

Smartphones Price

  • మెమెరీ చిప్ ధరలతో స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్
  • ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్న నథింగ్ సీఈఓ
  • రూ. 10వేల నుంచి రూ. 25వేల మధ్య ధర ఫోన్లలో పెరిగే అవకాశం

Smartphones Price Hike : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే కొనేసుకోండి. ఎందుకంటే.. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరగవచ్చని నథింగ్ సీఈఓ కార్ల్ పెయ్ సూచించారు. కొత్త టాక్స్ లేదా ఫీచర్ కాదు.. దీనికి మెమరీ చిప్‌ల ధరల పెరుగుదలే కారణం. ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ (RAM), స్టోరేజ్ చాలా ముఖ్యం. ఈ మెమరీ చిప్‌ల ధరలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల ఖర్చులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. స్మార్ట్ ఫోన్ (Smartphones Price Hike) మేకర్లు పాత ధరలకు ఫోన్‌లను విక్రయించడం కష్టమవుతుందని సీఈఓ కార్ల్ పెయ్ అంటున్నారు. రాబోయే నెలల్లో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ కొనాలంటే గతంలో కన్నా ఎక్కువ ఖర్చు చేయక తప్పదు.

సీఈఓ కార్ల్ పెయ్ ఏమన్నారంటే? :
మెమరీ చిప్ మార్కెట్‌లో ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయని నథింగ్ సీఈఓ కార్ల్ పీ వెల్లడించారు. ర్యామ్, స్టోరేజ్ చిప్‌లకు పెరిగిన డిమాండ్ కారణంగా ఫోన్ల ధరలు ఇంకా పెరుగుతాయని అన్నారు. ప్రాసెసర్‌లు, డిస్‌ప్లేలు, కెమెరాలతో పాటు స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి కంపెనీలకు మెమరీ చిప్‌లు కూడా చాలా ముఖ్యం. అందుకే వీటి ధరల పెరిగితే ఫోన్ల ధరలు కూడా భారీగా పెరుగుతాయని సీఈఓ పెయ్ అంటున్నారు.

Read Also : UPI AI Agents : AI ఏజెంట్లకు UPI పవర్! ఇక మీ బదులు పేమెంట్లు చేసేస్తాయి.. ఎలాగంటే? ఫుల్ డిటెయిల్స్

మెమరీ చిప్స్ ఏంటి? :
స్మార్ట్‌ఫోన్‌లలో రెండు రకాల మెమరీని వాడుతారు. అందులో మొదటిది ర్యామ్, మీ ఫోన్ స్పీడ్, మల్టీటాస్కింగ్‌ కోసం అవసరం. రెండోది స్టోరేజ్.. ఫోటోలు, వీడియోలు, యాప్‌లు, ఇతర డేటాను స్టోర్ చేస్తుంది. ఈ రెండు చిప్‌ల ధర పెరిగితే కంపెనీలకు స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది.

స్మార్ట్‌ఫోన్ కంపెనీలపై ప్రభావం ఉందా? :
సాధారణంగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లు, ఎక్కువ ర్యామ్, స్టోరేజ్‌ ఆప్షన్లతో కొత్త ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కానీ, మెమరీ చిప్‌ల ధరల పెంపుతో కంపెనీలు లాభాలను తగ్గించుకోవడం లేదా ధరలను పెంచక తప్పదు.

ఈ ధరల ప్రభావం మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఎక్కువగా ఉంటుంది. ర్యామ్, స్టోరేజ్ ధరలు పెరిగితే, రూ. 10వేల నుంచి రూ. 25వేల మధ్య ధర ఫోన్లలో భారీ మార్పులు రావచ్చు. ఈ పరిస్థితిలో ఆండ్రాయిడ్ బ్రాండ్‌లే కాదు.. ఐఫోన్ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.