UPI AI Agents : AI ఏజెంట్లకు UPI పవర్! ఇక మీ బదులు పేమెంట్లు చేసేస్తాయి.. ఎలాగంటే? ఫుల్ డిటెయిల్స్
UPI AI Agents : యూపీఐ పేమెంట్లు ఇకపై ఏఐ ఏజెంట్లు చేయనున్నాయి. కేవలం షాపింగ్, బుకింగ్‌లకే పరిమితం కాదు.. యూజర్లు చేయాల్సిన అన్ని పనులను ఇకపై ఏఐ ఏజెంట్లు చేయగలవని పైన్ ల్యాబ్స్ అనే కొత్త కంపెనీ నిరూపించింది.
AI agents ( Image Credit : AI )
- షాపింగ్ నుంచి బిల్లుల వరకు ఏఐ ఏజెంట్లతో పేమెంట్లు
- యూపీఐ పేమెంట్లను కూడా స్వయంగా చేయగలవు
- పిన్ ఎంటర్ చేయకుండా యూపీఐ పేమెంట్లు ఎలా సాధ్యం?
- కొత్త పరిష్కారం కనిపెట్టిన పైన్ ల్యాబ్స్ సంస్థ
UPI AI Agents : ఏఐ టెక్నాలజీ రోజురోజుకీ మరింత అడ్వాన్స్ అయిపోతోంది. మనిషి చేయాల్సిన అన్ని పనులను ఈ ఏఐనే చేసేస్తోంది. ఇప్పటివరకూ ఏఐ చాట్బాట్లు యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేయడం, కోడ్ రాయడం, ఫొటోలు క్రియేట్ చేయడం వంటి పనులు చేసేవి.
కానీ, కొత్తగా వచ్చిన ఏఐ ఏజెంట్లు మాత్రం అంతకు మించి పనులు చేసి పెడతాయి. ఏఐ ఏజెంట్లు (UPI AI Agents) ఆన్లైన్ పేమెంట్లను ఒక్కటే ప్రాసెస్ చేయలేకపోయాయి. అయితే, ఇకపై అలా కాదు.. ఇప్పటినుంచి షాపింగ్, బుకింగ్‌తో పాటు యూపీఐ పేమెంట్లను కూడా ప్రాసెస్ చేయగలవు. యూజర్ల చేయాల్సిన అన్ని పనులను చెప్పిన టైంకు ఆటోమాటిక్ గా చేసిపెడతాయి.
ఉదాహరణకు.. తక్కువ రేటులో ఫ్లయిట్ టికెట్ ఉందో చూడమంటే చూసి తేదీతో సహా బుకింగ్ చేస్తుంది. విదేశాల్లో అయితే ఈ సిస్టమ్ వర్కౌట్ అవుతుంది.. కానీ, భారత్‌లో మాత్రం కష్టమే.. ఎందుకంటే.. దేశంలో యూపీఐ పేమెంట్లకు లిమిట్ ఉంది.
తప్పనిసరిగా యూపీఐ పిన్ లేదా MPIN ద్వారా యూజర్ల అథెంటికేషన్ ఉండాల్సిందే. ఏఐ ఏజెంట్లు వాటంతటా అవే పేమెంట్లు చేయలేవు. ప్రస్తుతం ఏఐ ఏజెంట్ సిస్టమ్ స్వయంగా యూపీఐ పేమెంట్లు ఎలా చేయగలవు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యకు పైన్ లాబ్స్ ఒక అద్భుతమైన పరిష్కారం కనిపెట్టింది.
పైన్ లాబ్స్ కొత్త పరిష్కారం ఏంటి? :
ఈ సమస్యను పరిష్కరించేందుకు పిన్ లాబ్స్ ‘Pine Labs Payment Protocol (P3P)’ అనే కొత్త సిస్టమ్ రూపొందించింది. ఇప్పటికే యూపీఐలో వాడే వన్ టైమ్ మ్యాండేట్ (OTM), రిజర్వ్ పే సదుపాయాల మాదిరిగానే ఉంటుంది. దీనికి యూజర్ ముందుగా పర్మిషన్ ఇవ్వాలి అంతే.. ఆ తర్వాత ఏఐ ఏజెంట్ యూజర్ చెప్పిన పరిమితి వరకు మాత్రమే పేమెంట్లు పూర్తి చేస్తాయి. ప్రతి పేమెంట్ కోసం ఇక పిన్ ఎంటర్ చేయాల్సిన పనిఉండదు.
యూజర్ల డబ్బుకు సేఫ్టీ ఉంటుందా? :
ఏఐ ఏజెంట్ల చేతుల్లో పెడితే డబ్బును ఎడాపెడా ఖర్చు చేస్తే పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ఉంటుంది. అసలు ఏఐ ఏజెంట్ కంట్రోలింగ్ లేకుంటే అది ఎలా ఖర్చు చేస్తుందో చెప్పలేం కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందుకోసమే గ్రాంటెక్స్ అనే డిజిటల్ పర్మిషన్ సిస్టమ్ ఏఐ ఏజెంట్ల కోసం వాడుతున్నారు. ఈ సిస్టమ్ ఏఐకి ఎంత వరకు ఖర్చు చేయగలవో ముందే చెబుతుంది. ప్రతి పేమెంట్ రికార్డును కూడా స్టోర్ చేస్తుంది. తద్వారా వినియోగదారుల డబ్బులకు కూడా సేఫ్టీ ఉంటుంది.
Read Also : Aadhaar QR Code : UIDAI కొత్త రూల్స్.. ఇక ఆధార్ జిరాక్స్ అడిగినా ఇవ్వొద్దు..! QR కోడ్ స్కాన్ చేస్తే చాలు!
ఏఐ ఏజెంట్లు ఇప్పటికే ఉన్నాయా? :
ప్రస్తుతం గుల్లాక్ యాప్‌లో ఈ ఏఐ ఏజెంట్ సిస్టమ్ ఒకటి అందుబాటులో ఉంది. ఉదాహరణకు.. మీరు గోల్డ్ ధర గ్రాముకు రూ. 16వేల కన్నా తక్కువైతే రూ. 500 విలువైన గోల్డ్ కొనుగోలు చేయి’ అని యూజర్ ఒకసారి చెబితే.. ఆ ఏఐ ఏజెంట్ ధరలను గమనిస్తూ.. సరైన సమయంలో ఆటోమాటిక్‌గా కొనేస్తుంది అనమాట. ఆ తర్వాత వినియోగదారునికి పేమెంట్ వివరాలను కూడా పంపుతుంది.
ఆన్లైన్ షాపింగ్ విధానం మారిపోనుందా? :
ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ అనేది మనుషులే ఆఫర్లు, డిస్కౌంట్లను చెక్ చేసి మరి కొనేస్తుంటారు. భవిష్యత్తులో ఏదైనా కొత్త మొబైల్, స్మార్ట్ టీవీ లేదా ఫ్రిజ్ వంటివి కొనాలంటే ఆఫర్లు, డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ముందుగానే ఏఐ ఏజెంట్లు చెక్ చేసి కొనేస్తాయి. ఆఫర్ ఎప్పుడు తగ్గుతుందో టైమ్ ఆధారంగా గుర్తించి వెంటనే ఆ ప్రొడక్టు కొనేస్తాయి. అంటే.. ఇకపై వినియోగదారులకు 24 గంటల పాటు ఒక పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్ వెంట ఉన్నట్టే..
ఏఐ ఏజెంట్లకు ఆర్బీఐ అనుమతి ఉందా? :
ప్రస్తుతానికి టెక్నికల్‌గా ఈ ఏఐ ఏజెంట్ సిస్టమ్ రెడీగా ఉన్నా యూపీఐ పేమెంట్లు ఎలా చేయాలి? అనే విషయంలో ఆర్బీఐ ఇంకా ఎలాంటి ప్రత్యేక నిబంధలను జారీ చేయలేదు. ఆర్బీఐ అనుమతి లేకుండా ఏఐ ఏజెంట్ సిస్టమ్ ఎలాంటి పేమెంట్లను సొంతంగా చేయలేదు.
అందుకే పేమెంట్ విషయంలో ఎవరిది బాధ్యత? యూజర్లకు ప్రొటెక్షన్ ఎలా? అనే ప్రశ్నార్థకంగా మారింది. ఈ సరికొత్త టెక్నాలజీ భవిష్యత్తులో ఎలా విస్తరిస్తుంది అనేది కూడా పూర్తిగా నియంత్రణ సంస్థల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.
