Gemini Intelligence : వావ్.. సూపర్ AI టెక్నాలజీ.. ఇక ఫోన్ మీరు వాడరు.. మీ ఫోన్ మీకోసం అన్నీ చేస్తుంది!
Google New AI Agent : జెమిని ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మీ ఈమెయిల్స్ నుంచి డేటాను సేకరించి అసిస్టెన్స్‌గా పనిచేస్తుంది. షాపింగ్ లేదా బుకింగ్ వంటి టాస్కులను కూడా అదే చేయగలదు. ఎలాగంటే?
- Sreehari A
- Published on- May 18, 2026 / 07:51 PM IST
Google AI Agent ( Image Credit : AI )
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ జెమిని ఇంటెలిజెన్స్ ఫీచర్
- మీరు చేయాల్సిన పనులన్నీ మీ స్మార్ట్ ఫోన్ చేసి పెడుతుంది
- ఈ జెమిని ఏఐ టెక్నాలజీ కొత్త ఏఐ ఏజెంట్ మాదిరిగా మారుతుంది
Gemini Intelligence : ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. గూగుల్ మొబైల్ ఫోన్ యూజర్ల కోసం జెమిని ఇంటెలిజెన్స్ అనే అద్భుతమైన ఏఐ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇకపై మీ స్మార్ట్‌ఫోన్ మీ పనులన్నీ అదే చకచకా చేసి పెట్టగలదు. అవును.. మీరు చదివింది నిజమే.. మీరు ఇలా చెబితే చాలు.. అదే స్వయంగా అన్ని పనులు పూర్తి చేయగలదు. ఇదంతా జెమిని ఏఐ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది అనమాట.
గూగుల్ ‘ఏజెంటిక్ AI’ని ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్‌తో ఈ కొత్త ఏఐ టెక్నాలజీని (Gemini Intelligence) అందిస్తోంది. అంటే.. ఇకపై మీ ఫోన్ కేవలం యాప్‌లను ఓపెన్ చేయడం, మీ ఆర్డర్స్ కాకుండా మీరు చేయాల్సిన పనిని అర్థం చేసుకుని అన్ని పనులను దానికిఅదే పూర్తి చేస్తుంది.
ఈ వేసవిలో శాంసంగ్ గెలాక్సీ S26,గూగుల్ పిక్సెల్ 10 ఫోన్లలో మాత్రమే జెమిని ఇంటెలిజెన్స్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత, స్మార్ట్‌వాచ్‌లు, కార్లు, స్మార్ట్ గ్లాసెస్, ల్యాప్‌టాప్‌లకు కూడా విస్తరించనున్నారు.
మీ ఫోన్ మల్టీ టాస్కులను చేయగలదు :
గూగుల్ ప్రకారం.. జెమిని ఇంటెలిజెన్స్ అనేక యాప్‌లలో క్లిష్టమైన మల్టీ టాస్కులను కూడా ఈజీగా పూర్తి చేయగలదు. యూజర్లు వేర్వేరు యాప్‌లను పదేపదే వాడాల్సిన అవసరం ఉండదు.
ఉదాహరణకు.. ఒక విద్యార్థి జీమెయిల్‌లో క్లాస్ సిలబస్ ఉంటే.. జెమిని ఆ సిలబస్‌ను చదివి, అవసరమైన పుస్తకాలను గుర్తించి వాటిని వారి ఆన్‌లైన్ షాపింగ్ కార్ట్‌కు యాడ్ చేస్తుంది. అంతేకాదు.. ఇది స్పిన్ క్లాస్ కోసం బైక్‌ను బుక్ చేయడం వంటి పనులను కూడా చేయగలదు.
గూగుల్ వ్యూ సందర్భాన్ని కూడా చెప్పగలదు. ఉదాహరణకు.. మీరు నోట్స్ యాప్‌లో కిరాణా సామానుల జాబితాను రెడీ చేశారనుకుందాం.. ఇప్పుడు మీరు కేవలం పవర్ బటన్‌ను ట్యాప్ చేసి ‘ఈ వస్తువులతో ఒక డెలివరీ షాపింగ్ కార్ట్‌ను క్రియేట్’ చేయమని జెమినికి చెప్పవచ్చు. అప్పుడు ఏఐ (AI) అన్ని వస్తువులను ఆటోమాటిక్‌గా కార్ట్‌లో యాడ్ చేస్తుంది.
ఫొటోలను చూసి అర్థం చేసుకోగలదు :
జెమిని ఇంటెలిజెన్స్ టెక్స్ట్‌ను మాత్రమే కాకుండా ఫొటోలను కూడా అర్థం చేసుకోగలదు. ఉదాహరణకు.. ఒక యూజర్ హోటల్ లాబీలోని ట్రావెల్ బ్రోచర్‌ను ఫొటో తీసి ‘ఎక్స్‌పీడియాలో 6 కోసం ఇలాంటి టూర్‌ను సెర్చ్ చేయండి’ అని చెబితే జెమిని బ్యాగ్ గ్రౌండ్ వర్క్ మొదలవుతుంది.
ఈ ఏఐ లైవ్ ప్రోగ్రెస్ నోటిఫికేషన్‌లను కూడా డిస్ ప్లే చేస్తుంది. అన్నీ రెడీ కాగానే ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం యూజర్లను అడుగుతుంది. అంటే.. ఈ మొత్తం ప్రాసెస్ మునుపెన్నడూ లేనంత ఈజీగా ఫాస్ట్ మారబోతోంది అనమాట.
ఫారం నింపడం, వాయిస్ టైపింగ్ ఈజీ :
మొబైల్ ఫోన్లలో ఎదురయ్యే రెండు మెయిన్ సమస్యలను గూగుల్ ఈజీ చేస్తోంది. అందులో ఫస్ట్ లాంగ్ ఫారమ్‌లను నింపడం. ఇప్పుడు, యూజర్ల ద్వారా జెమిని లింక్ అయిన యాప్‌ల నుంచి అవసరమైన డేటాను తీసుకుని కేవలం ఒక్క ట్యాప్‌తో లాంగ్ ఫారమ్‌లను చిటికెలో నింపగలదు. ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్ (ఆప్ట్-ఇన్) ఉంటుంది. అంటే యూజర్ల అనుమతి లేకుండా డేటాను యాక్సస్ చేయదని గూగుల్ చెబుతోంది. యూజర్ల ప్రైవసీ, కంట్రోలింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
Read Also : EPFO Rules 2026 : PF డబ్బుల కోసం ఇక టెన్షన్ లేదు.. EPFO కొత్త రూల్స్‌తో ఫాస్ట్ సెటిల్‌మెంట్!
గూగుల్ జీబోర్డులో రాంబ్లర్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ యూజర్ల మాటతీరును అర్థం చేసుకోగలదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు ‘ఉమ్’ లేదా ‘లైక్’ వంటి పదాలను పదేపదే వాడితే రాంబ్లర్ వాటిని డిలీట్ చేసి క్లియర్, చక్కని మెసేజ్ క్రియేట్ చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మల్టీ లాంగ్వేజీ సపోర్టును కూడా అందిస్తుంది. అంటే యూజర్లు ఒకే వాయిస్ టైపింగ్‌లో ఇంగ్లీష్, హిందీ రెండింటినీ వాడొచ్చు.
క్రియేట్ మై విడ్జెట్ ఫీచర్ :
గూగుల్ ఫస్ట్ టైమ్ ‘జెనరేటివ్ యూఐ’ని ప్రవేశపెట్టింది. అలాగే ‘క్రియేట్ మై విడ్జెట్’ అనే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు జెమెని యూజర్లు తమ అవసరాల కోసం కస్టమ్ విడ్జెట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు.. ఒక యూజర్ ప్రతి వారం 3 హై-ప్రోటీన్ వంటకాలను సూచించే విడ్జెట్‌ను కోరుకుంటే.. జెమిని అలాంంటి విడ్జెట్‌ను క్రియేట్ చేస్తుంది. యూజర్ చూడాలనుకుంటున్న డేటాను మాత్రమే చూపించే కస్టమ్ వెదర్ విడ్జెట్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విడ్జెట్‌లు పూర్తిగా రీసైజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పాటు వేర్ ఓఎస్ వాచ్‌లలో కూడా రన్ అవుతాయి.
కొత్త డిజైన్, ఇక ఫుల్ ప్రైవసీ :
కొత్త ఏఐ ఫీచర్లతో పాటు గూగుల్ మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ అనే కొత్త డిజైన్ లాంగ్వేజ్ కూడా ప్రవేశపెడుతోంది. తద్వారా ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ గతంలో కన్నా మరింత అడ్వాన్స్, ఇంటరాక్టివ్‌గా కనిపిస్తుంది. జెమిని ఏఐ కేవలం నిర్దిష్ట యూజర్ ప్రాంప్ట్‌లపై మాత్రమే పనిచేస్తుంది. ఆ వర్క్ పూర్తి అయ్యాక వర్క్ ఆగిపోతుందని కంపెనీ స్పష్టం చేసింది. అంటే.. యూజర్లకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. వారి ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
