Ola Electric Prices Cut : ఓలా స్కూటర్ కొంటున్నారా? భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

Ola Electric Prices Cut : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు భారీగా తగ్గాయి. భవిష్యత్తులో బ్యాటరీ సెల్ ధరలు మరింత తగ్గవచ్చునని, ఈవీ వాహనాలు ధరలు మరింత తగ్గవచ్చునని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.

Ola Electric Prices Cut : ఓలా స్కూటర్ కొంటున్నారా? భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

Ola S1 electric scooter range gets significant price cuts, check details here

Ola Electric Price Cut : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను రూ.25వేల వరకు తగ్గించింది. ఓలా కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎస్1 ఎక్స్ ప్లస్, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రోలను అందిస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో బ్యాటరీ సెల్ ధరలు తగ్గిన నేపథ్యంలో ఓలా తమ స్కూటర్ల ధరలను భారీగా తగ్గించింది. ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) ధరలో బ్యాటరీ ధర దాదాపు 40శాతం ఉంటుంది. పరిశ్రమ విశ్లేషకుల ప్రకారం.. భవిష్యత్తులో బ్యాటరీ సెల్ ధరలు మరింత తగ్గవచ్చునని అభిప్రాయపడ్డారు. తద్వారా ఈవీ వాహనాల ధరలు మరింత ధర తగ్గే అవకాశం ఉందన్నారు.

ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల కోసం ఈ ఫిబ్రవరి 16 నుంచి స్కూటర్ల ధరలను రూ. 25వేల వరకు తగ్గిస్తున్నామని ప్రకటించారు. ప్రధానంగా ఓలా ఎస్1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై తగ్గింపు ధరలు (ఎక్స్-షోరూమ్) ఇలా ఉన్నాయి.

  • ఓలా ఎస్1 ప్రో :  రూ. 1,47,499  – రూ. 1,29,999
  • ఓలా ఎస్1 ఎయిర్ :  రూ. 119,999  – రూ. 104,999
  • ఓలా ఎస్1 ఎక్స్ (4kWh) : రూ. 109,999 – రూ. 109,999
  • ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ (3kWh) : రూ. 109,999  – రూ. 84,999
  • ఓలా ఎస్1 ఎక్స్ (3kWh) :  రూ. 89,999  – రూ. 89,999
  • ఓలా ఎస్1 ఎక్స్ (2kWh) :  రూ. 79,999  – రూ. 79,999

ఓలా కంపెనీ మొదటి 8 సంవత్సరాల/80వేల కి.మీ ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీని ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మొత్తం రేంజ్ ప్రొడక్టుల కోసం ప్రారంభించింది. ఓలా ఎలక్ట్రిక్ ఏప్రిల్ 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రస్తుత 414 సర్వీస్ సెంటర్‌ల నుంచి 600 సెంటర్‌లకు సర్వీస్ నెట్‌వర్క్‌ను 50శాతం విస్తరించే ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది.

జనవరిలో పెరిగిన ఓలా రిటైల్ సేల్స్ :
ఇండస్ట్రీ బాడీ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) డేటా ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ రిటైల్ అమ్మకాలు జనవరి 2024లో 75.73శాతం పెరిగి 18,353 యూనిట్ల నుంచి 32,252 యూనిట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2023లో కంపెనీ 30,263 యూనిట్లను విక్రయించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జనవరి 2024లో 26.14శాతం పెరిగి 81,608 యూనిట్లకు చేరాయి.

డిసెంబర్ 2023లో రిటైల్ విక్రయాలు 75,522 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ (PV) విభాగంలో టాటా మోటార్స్ ఇటీవల (Nexon.ev) కార్ల ధరలను రూ. 1.2 లక్షల వరకు (Tiago.ev) కార్ల ధరలను రూ. 70వేల వరకు తగ్గించింది. ఎంజీ మోటార్ ఇండియా ఈ నెల ప్రారంభంలో కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ ధరలను కూడా భారీగా తగ్గించింది.

Read Also : Ola Electric Sales January : జనవరిలో దుమ్మురేపిన ఓలా ఎలక్ట్రిక్.. అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్లతో రికార్డు.. 40శాతం వాటాతో ఆధిపత్యం..!