OnePlus 13 Leak : 2కె డిస్‌ప్లే, పెరిస్కోప్ కెమెరాతో వన్‌ప్లస్ 13 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్ వన్‌ప్లస్ 13 అతి త్వరలో లాంచ్ కానుంది. ముందుగా చైనీస్ మార్కెట్‌లోకి ఆపై భారత్ సహా ఇతర మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.

OnePlus 13 Leak : వన్‌ప్లస్ 12 ఈ ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ అయింది. అయితే ఈ డివైజ్ మొదట 2023 చివరిలో చైనాలో రిలీజ్ అయింది. ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్ వన్‌ప్లస్ 13 అతి త్వరలో లాంచ్ కానుంది. ముందుగా చైనీస్ మార్కెట్‌లోకి ఆపై భారత్ సహా ఇతర మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. లాంచ్ టైమ్‌లైన్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రాబోయే వన్‌ప్లస్ 13 స్పెషిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

Read Also : Reliance Jio Number : కొత్త జియో నెంబర్ ఏంటో మర్చిపోయారా? ఈ 5 పద్ధతుల్లో మీ నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు!

టిప్‌స్టర్ ప్రకారం.. వన్‌ప్లస్ 13 ఫోన్ 2కె రిజల్యూషన్‌తో భారీ 6.8-అంగుళాల మైక్రో-కర్వ్డ్ స్క్రీన్‌తో రావచ్చని పేర్కొంది. మెరుగైన బ్యాటరీ లైఫ్ అందించనుంది. గత మోడల్‌ల మాదిరిగానే ఈ డివైజ్ LTPO టెక్నాలజీకి సపోర్టు అందించనుంది. డిస్‌ప్లే పరంగా పెద్ద అప్‌గ్రేడ్స్ ఉండకపోవచ్చు. వన్‌ప్లస్ 12 అదే స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. డిజైన్‌లో పెద్ద మార్పుతో రానుంది. లీక్‌ల వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

రాబోయే వారాలు లేదా నెలల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, వన్‌ప్లస్ 13 బయోమెట్రిక్స్ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని లీక్‌లు పేర్కొన్నాయి. ముందున్న ఆప్టికల్ సెన్సార్ కన్నా పెద్ద అప్‌గ్రేడ్‌తో రానుంది. అల్ట్రాసోనిక్ సెన్సార్ డివైజ్ అన్‌లాక్ చేయనుంది. స్పాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 ఎస్ఓసీ వన్‌ప్లస్ 13కి పవర్ అందించే అవకాశం ఉంది. క్వాల్‌కామ్ నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ చిప్, ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్ 13 బ్యాక్ కెమెరా సిస్టమ్ జూమింగ్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో సహా మల్టీ-ఫోకల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. మిగిలిన ఫీచర్లు ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతానికి, వన్‌ప్లస్ 13 లాంచ్ టైమ్‌లైన్‌పై ఎలాంటి సమాచారం లేదు. కానీ, సాధారణంగా వన్‌ప్లస్ ప్రతి ఏడాదిలో 2024లో ఒక ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను లాంచ్ చేస్తుంది. ఈ ఏడాదిలో గ్లోబల్ రీజియన్‌లలో లాంచ్ చేయదు. ఈ ఏడాది చివరిలో చైనాలో నెక్స్ట్ జనరేషన్ వన్‌ప్లస్ 13 ఫోన్ లాంచ్ కానుందని భావిస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో వన్‌ప్లస్ 12 లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 64,999తో అందుబాటులో ఉంది. రాబోయే వన్‌ప్లస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కూడా ఇదే ధర రేంజ్‌లో ఉండవచ్చు. కంపెనీ ధరను కొంత మార్జిన్‌తో పెంచే అవకాశం ఉంది. ఈ ఫోన్ వివరాలు తెలియాల్సి ఉంది. కొత్త ఫీచర్‌లు యూజర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఉంటాయా? అనేదానిపై ఆధారపడి ఉంటుంది. వన్‌ప్లస్ 12 లాంచ్‌తో పాటు ప్రతి బ్రాండ్ సరసమైన ధరకు హై-ఎండ్ ఫీచర్‌లను అందిస్తోంది.

Read Also : OnePlus Phones : ఈ 2 వన్‌‌ప్లస్ ఫోన్లపై నిలిచిపోయిన సాఫ్ట్‌‌వేర్ అప్‌డేట్స్!

ట్రెండింగ్ వార్తలు