Reliance Jio Number : కొత్త జియో నెంబర్ ఏంటో మర్చిపోయారా? ఈ 5 పద్ధతుల్లో మీ నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు!

మీ కొత్త జియో నంబర్‌ను మర్చిపోయారా? ఈ 5 పద్ధతుల ద్వారా జియో నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు..

Reliance Jio Number : కొత్త జియో నెంబర్ ఏంటో మర్చిపోయారా? ఈ 5 పద్ధతుల్లో మీ నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు!

How to Check Your Jio Number Using 5 Different Methods

Reliance Jio Number : మీరు కొత్త జియో నంబర్‌ తీసుకున్నారా? జియో నంబర్‌ను గుర్తుంచుకోవడం కష్టంగా ఉండవచ్చు. మీ జియో నెంబర్ పూర్తిగా గుర్తుంచుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే, ఈ గ్యాప్ సమయంలో కొత్తగా కొనుగోలు చేసిన జియో నంబర్‌లను ఎలా గుర్తుంచుకోవాలి అని ఆలోచిస్తూ ఉండవచ్చు.

అంతేకాకుండా, కొన్ని కోడ్‌లు లేదా ఇతర పద్ధతులను ఉపయోగించి జియో నంబర్‌ని చెక్ చేయడానికి ఏవైనా ఆప్షన్లు ఉన్నాయా? సరే, మీరు మీ నంబర్‌ను తెలుసుకోవడానికి 5 విభిన్న మార్గాలు ఉన్నాయి. ఈ పద్ధతుల గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : WhatsApp iPhone Users : వాట్సాప్ ఐఫోన్ యూజర్లు ఇకపై పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

యూఎస్ఎస్‌డీ (USSD) కోడ్ ద్వారా జియో నంబర్ చెక్ చేయండి :
జియో కస్టమర్‌లు యూఎస్ఎస్‌డీ కోడ్‌ని ఉపయోగించడం ద్వారా జియో నంబర్ ద్వారా అన్ని వివరాలను కూడా పొందవచ్చు.

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ లేదా డయలర్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు సిమ్1 కోసం *1# లేదా సిమ్ 2 కోసం *2# డయల్ చేయండి.
  • మీ జియో నంబర్‌ను చూపే పాప్-అప్ లేదా ఎస్ఎంఎస్ పొందవచ్చు.

పైన పేర్కొన్న మెథడ్ పనిచేయకపోతే, మీ రిజిస్టర్డ్ జియో మొబైల్ నంబర్ నుంచి 1299కి డయల్ చేయండి. వ్యాలిడిటీ, ప్లాన్ వివరాలు, ఇతర వివరాలతో పాటు మీ జియో నంబర్‌ను సూచిస్తూ ఎస్ఎంఎస్ పొందవచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా జియో నంబర్ చెక్ చేయండి :
మీ జియో నంబర్‌ని చెక్ చేయడానికి నిర్దిష్ట కోడ్ లేనప్పటికీ, ఎస్ఎంఎస్ కోడ్ ద్వారా మీ ప్లాన్‌లు, వ్యాలిడిటీ మరిన్నింటిని తెలుసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఆసక్తికరంగా, ఎస్ఎంఎస్ ద్వారా జియో నంబర్‌ను కూడా తెలుసుకోవచ్చు.

  • మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లో మెసేజ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
  • 199కి ఎస్ఎంఎస్ పంపండి. మైప్లాన్ అని టైప్ చేయండి.
  • Send బటన్‌ను నొక్కండి. త్వరలో మీ జియో నంబర్, వ్యాలిడిటీ, డేటా, అకౌంట్ బ్యాలెన్స్ వంటి ప్లాన్ వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా అందుకుంటారు.

మైజియో యాప్ ద్వారా జియో నంబర్ చెక్ చేసుకోండి :

  • మైజియో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా జియో నంబర్‌ని చెక్ చేయొచ్చు.
  • ఈ యాప్ గూగుల్ ప్లే, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంది.
  • మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లో మైజియో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
  • అప్లికేషన్‌ను ఓపెన్ చేసి సిమ్‌తో సైన్‌ఇన్‌పై నొక్కండి.
  • మీ జియో నంబర్ స్క్రీన్ పైభాగంలో కనిపిస్తుంది.

కస్టమర్ కేర్ సపోర్ట్ ద్వారా జియో నంబర్ చెక్ చేయండి :
కస్టమర్ కేర్ సపోర్ట్‌కి కాల్ చేయడం ద్వారా జియో నంబర్‌ని చెక్ చేయొచ్చు. ఈ ఆఫ్‌లైన్ పద్ధతి ద్వారా మీ డేటా ప్లాన్, అకౌంట్ బ్యాలెన్స్ వంటి ఇతర వివరాలతో పాటు మీ మొబైల్ నంబర్‌ను కనుగొనడానికి అనుమతిస్తుంది. కస్టమర్ కేర్ సపోర్ట్ నుంచి మీ జియో నంబర్‌ను ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మీ మొబైల్‌లో మీ ఫోన్ లేదా డయలర్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ జియో మొబైల్ నంబర్ నుంచి 1800899999 లేదా 199కి డయల్ చేయండి.
  • మీరు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సర్వీసును అందుకోవచ్చు. మెను నుంచి ఇష్టపడే భాషను ఎంచుకోండి.
  • మీ ప్రస్తుత డేటా బ్యాలెన్స్, ప్లాన్ వ్యాలిడిటీని గురించి ఐవీఆర్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడటానికి సంబంధిత కీని నొక్కండి.
  • ప్రతినిధి నుంచి మీ మొబైల్ నంబర్ కోసం అడగండి.

మరో మొబైల్‌కి కాల్ చేయడం ద్వారా జియో నంబర్‌ని చెక్ చేయండి :
మీ జియో నంబర్‌ని చెక్ చేయడానికి చివరి ఆప్షన్.. మీ స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యునికి కాల్ చేయాలి. మీ సమీపంలో స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులు ఉంటే.. మీ జియో నంబర్ నుంచి వారికి కాల్ చేయండి. మీ మొబైల్ నంబర్‌ను చూస్తారు. మీ జియో నంబర్ ఆటోమేటిక్‌గా తెలుస్తుంది.

Read Also : CEO Sundar Pichai : గూగుల్‌లో సుందర్ పిచాయ్ 20ఏళ్ల ప్రస్థానం.. సాధారణ ఉద్యోగి నుంచి సీఈఓ స్థాయికి..!