OnePlus 15R Launch
OnePlus 15R Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 15 తర్వాత వన్‌ప్లస్ 15R భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ 13R అప్‌గ్రేడ్ వెర్షన్ గురించి అనేక నివేదికలు వచ్చాయి. రాబోయే ఈ వన్‌ప్లస్ 15R ఫోన్ డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరా, ఏఐ ఫీచర్లను పొందవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 అదే రోజున లాంచ్ అవుతుందని (OnePlus 15R Launch) కంపెనీ ధృవీకరించింది. అమెజాన్ ఆన్‌లైన్ ఇ-స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర రేంజ్ సహా వన్‌ప్లస్ 15R ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ 15R భారత్ లాంచ్ తేదీ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 15R డిసెంబర్ 17న లాంచ్ అవుతుంది. చార్‌కోల్ బ్లాక్ మింటీ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లు లభిస్తాయని చెబుతున్నారు. అయితే, లభ్యత, బ్యాంక్ ఆఫర్‌లు, ఇతర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.
వన్‌ప్లస్ 15R స్పెసిఫికేషన్లు (అంచనా) :
వన్‌ప్లస్ 15R ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంటుందని అంచనా. ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ నుంచి పవర్ పొందింది. 12GB వరకు LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుందని చెబుతున్నారు. 8,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని, 100W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వవచ్చునని చెబుతున్నారు.
ఈ వన్‌ప్లస్ ఫోన్ ఆక్సిజన్OS 16 ఆధారంగా ఆండ్రాయిడ్ 16లో రన్ అవుతుంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP68, IP69 సర్టిఫికేట్లు పొందవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 15R ఫోన్ 50MP మెయిన్, 50MP సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ వన్‌ప్లస్ NFC, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
వన్‌ప్లస్ 15R డిజైన్ :
వన్‌ప్లస్ 15R కొత్త డిజైన్‌తో రావచ్చు. వన్‌ప్లస్ 15 మాదిరిగానే ఉంటుంది. ఈ డివైస్ ఫ్లాట్ ఫ్రేమ్, స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌తో రావచ్చు. కంపెనీ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ డివైస్ గురించి టీజ్ చేసింది. లీక్స్ ప్రకారం.. త్వరలో చైనాలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ Ace 6T మాదిరిగానే కనిపించవచ్చు.
వన్‌ప్లస్ 15R ఇండియా ధర (అంచనా) :
వన్‌ప్లస్ 15R ధర దాదాపు రూ.45వేలు ఉంటుందని అంచనా. రూ.42,999 ధర ఉన్న వన్‌ప్లస్ 13Rతో పోలిస్తే కొంచెం ఖరీదైనది. అయితే, ప్రస్తుతానికి పూర్తి వివరాలు రివీల్ కాలేదు.