OnePlus 15R Launch : వారెవ్వా.. ఇది కదా ఫోన్.. కొత్త వన్‌ప్లస్ 15R వచ్చేస్తోంది.. లాంచ్‍‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..

OnePlus 15R : వన్‌ప్లస్ 15R అతి త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది. లాంచ్‌కు ముందుగానే ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి.

OnePlus 15R Launch

OnePlus 15R : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ అక్టోబర్‌లో మిడ్‌రేంజ్ ఫోన్ వన్‌ప్లస్ Ace 6 లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, భారత మార్కెట్లో (OnePlus 15R) ఈ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్ 15Rగా రిలీజ్ కానుంది.

వన్‌ప్లస్ 15తోపాటు ఈ రీబ్రాండెడ్ వెర్షన్ కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌కు సమయం ఇంకా ఉండగా, డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ పరంగా భారీ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని లీక్‌లు సూచిస్తున్నాయి.

అంతేకాదు.. ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర పెంపుపై కూడా అనేక పుకార్లు ఉన్నాయి. అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 15ఆర్ అనేది వన్‍‌ప్లస్ 13Rకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ బ్రాండ్ వన్‌ప్లస్ 14 సిరీస్‌ను నిలిపివేస్తుందని సమాచారం. రాబోయే వన్‌ప్లస్ 15R గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 15R స్పెసిఫికేషన్లు :
రాబోయే వన్‌ప్లస్ 15R ఫోన్ 1.5K రిజల్యూషన్, అల్ట్రా-స్మూత్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని పుకారు ఉంది. ఈ కేటగిరీలోఅత్యంత వేగవంతమైన డిస్‌ప్లేలలో ఒకటిగా చెప్పవచ్చు.

Read Also : Vivo T4 Pro : కొత్త వివో కొత్త T4 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర, ఆఫర్లు మీకోసం..!

హుడ్ కింద, ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 13లోని అదే చిప్, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 7,000mAh భారీ యూనిట్‌తో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. 6,000mAh బ్యాటరీ కూడా ఉండొచ్చు.

కెమెరా విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 15R ట్రిపుల్-కెమెరా సెటప్‌తో రావచ్చు. కానీ, అప్‌గ్రేడ్ సెన్సార్‌లతో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఇతర పుకార్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్‌లతో వస్తుందని అంచనా. వన్‌ప్లస్ 13R ఫోన్ IP65 రేటింగ్‌తో పోలిస్తే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుందని అంచనా.

వన్‌ప్లస్ 15R ధర (అంచనా) :
ఈ అప్‌గ్రేడ్‌లతో వన్‌ప్లస్ 15R ధర ప్రస్తుత వన్‌ప్లస్ 13R ధర కన్నా రూ.39,999 నుంచి పెరగొచ్చు. లీక్‌లు, పుకార్ల ఆధారంగా భారత మార్కెట్లో ధర దాదాపు రూ.55వేల వరకు ఉండవచ్చు.