OnePlus N Series : వన్‌ప్లస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. చౌక ధరలకే కొత్త వన్‌ప్లస్ ఫోన్లు.. ఈసారి రేంజ్ ఊహించలేరంతే..!

OnePlus N Series : వచ్చే నెలలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ల ధర రూ. 20,000 లోపు ఉండవచ్చు. వన్‌ప్లస్ ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఇంకా రివీల్ చేయలేదు.

OnePlus N Series

  • సరసమైన ధరలో కొత్త వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ వచ్చేస్తోంది
  • ఈ సిరీస్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్ల ధర రూ. 20వేల కన్నా తక్కువే?
  • మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కేటగిరీలో జూలైలో లాంచ్ అయ్యే ఛాన్స్

OnePlus N Series : వన్ ప్లస్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. వన్‌ప్లస్ నుంచి భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్‌ వచ్చేస్తోంది. ఈ సరసమైన స్మార్ట్‌ఫోన్‌ 7,000mAh బ్యాటరీతో రానుంది. చీపెస్ట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం చూసేవారికి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ కొత్త వన్‌ప్లస్ N సిరీస్‌లోని ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెల జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ పోస్ట్‌ ప్రకారం. వన్‌ప్లస్ ఇండియా కంపెనీ సరసమైన ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్‌ల సిరీస్‌ను (OnePlus N Series) లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ సిరీస్‌లోని కొన్ని స్మార్ట్‌ఫోన్ల ధర రూ. 20వేల లోపు ఉండవచ్చు. అయితే, వన్‌ప్లస్ ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఇంకా ధృవీకరించలేదు. దేశంలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఈ కంపెనీకి భారీ మార్కెట్ వాటా ఉంది.

Read Also : Gold Price Today June 10 : కుప్పకూలిన బంగారం ధరలు.. వెండి ఢమాల్.. ఏపీ–తెలంగాణలో ఈరోజు తులం రేట్లు ఎంతంటే?

వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :
గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 లైట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 20,999, 8GB + 128GB వేరియంట్‌కు రూ. 22,999, 8GB + 256GB వేరియంట్‌కు రూ. 25,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.72-అంగుళాల ఫుల్ HD+ ఎల్సీడీ డిస్‌ప్లే (2,400×1,080 పిక్సెల్స్) ఉంది.

ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్ ఏఆర్ఎమ్, మాలి-G615 జీపీయూతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ రియర్ కెమెరా యూనిట్‌లో ఎఫ్/1.8 అపర్చర్, EIS సపోర్ట్‌తో 50MP ఓమ్నివిజన్ OV50D40 ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీ, 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.