OnePlus Nord Buds 4 Pro : ఛార్జ్ ఒక్కసారి.. మ్యూజిక్ 54 గంటలు.. ఈ OnePlus ఇయర్ బడ్స్ ధర చూస్తే షాక్ అవుతారు!
OnePlus Nord Buds 4 Pro : వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌లో 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బాస్‌తో 12mm డ్రైవర్లు, బ్లూటూత్ 6.0తో LHDC 5.0 ఆడియోకు సపోర్టు ఫీచర్లు ఉన్నాయి.
- Sreehari A
- Published On : March 20, 2026 / 11:57 AM IST
OnePlus Nord Buds 4 Pro
- వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో వచ్చేసింది
- ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్
- 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్
- 54 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్
OnePlus Nord Buds 4 Pro : వన్‌ప్లస్ అభిమానులకు పండగే. మీరు ఇయర్ బడ్స్ వాడేవారు అయితే మీకోసం భారత మార్కెట్లోకి కొత్త వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో వచ్చేసింది. ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ లాంచ్ అయింది. ఈ ఇయర్‌బడ్స్‌లో 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బాస్‌తో 12mm డ్రైవర్లు, LHDC 5.0 ఆడియో సపోర్ట్‌తో బ్లూటూత్ 6.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
కేస్‌తో కలిపి 54 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. వీటిలో ఏఐ-ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్, స్పెషల్ ఆడియో ఫీచర్లు కూడా ఉన్నాయి. నార్డ్ బడ్స్ 3 ప్రోతో నార్డ్ బడ్స్ 4 ప్రో వచ్చే వారం నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి.
భారత్‌లో వన్‌ప్లస్ బడ్స్ 4 ప్రో ధర ఎంతంటే? :
నార్డ్ బడ్స్ 4 ప్రో ధర రూ. 3,999 కాగా, లాంచ్ ఆఫర్‌లో రూ. 3,799కే లభిస్తాయి. రేడియంట్ గ్రే, రావెన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్స్ సేల్స్ మార్చి 23, 2025న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ద్వారా కొనేసుకోవచ్చు.
వన్‌ప్లస్ బడ్స్ 4 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ బడ్స్ 4 ప్రో ఇయర్‌బడ్స్‌లో టైటానియం కోటింగ్‌తో 12mm డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. బాస్, క్లియర్ వాయిస్ అందిస్తాయి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ 20Hz నుంచి 40kHz వరకు, డ్రైవర్ సెన్సిటివిటీ 122dBగా ఉంది.
ఈ ఇయర్‌బడ్స్ రియల్-టైమ్ ఏఐ అడ్జస్ట్‌మెంట్‌తో 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్టు ఇస్తాయి. గేమింగ్-ఫోకస్డ్ మోడ్‌తో సహా స్పెషల్ ఆడియోను అందిస్తాయి. క్లియర్ వాయిస్ కోసం ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్‌తో 6 మైక్రోఫోన్‌లు ఉన్నాయి.
Read Also : Samsung Galaxy A35 : బిగ్ డిస్కౌంట్ బ్రో.. రూ. 33వేల ఈ శాంసంగ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ రూ. 19వేల లోపే..!
కనెక్టివిటీ విషయానికి వస్తే.. నార్డ్ బడ్స్ 4 ప్రో బ్లూటూత్ 6.0, LHDC 5.0, AAC,SBC కోడెక్‌లకు సపోర్ట్ చేస్తాయి. 10 మీటర్ల వరకు సిగ్నల్ రేంజ్ అందిస్తాయి. గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్, డ్యూయల్-డివైస్ కనెక్షన్‌లకు కూడా సపోర్ట్ చేస్తాయి.
ఈ ఇయర్‌బడ్స్‌లో వాల్యూమ్ స్వైప్ గెచర్ తో టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఏఐ అసిస్టెంట్‌లకు సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేసే డివైజ్‌లలో హేమెలోడీ యాప్ ద్వారా ఏఐ ట్రాన్స్ లేషన్ ఎనేబుల్ చేస్తాయి. స్పాటిఫై ట్యాప్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. గెచర్ ద్వారా కెమెరాను కంట్రోల్ చేయొచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రోలో ప్రతి ఇయర్‌బడ్‌కు 62mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ కేస్‌లో 530mAh బ్యాటరీ ఉంటుంది. AAC కోడెక్, ANC ఆఫ్ చేసి, వాల్యూమ్ 50శాతం వద్ద ఉంచితే మొత్తం 54 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుందని వన్‌ప్లస్ పేర్కొంది.
ఇయర్‌బడ్స్‌ను ఛార్జ్ చేసేందుకు సుమారు 60 నిమిషాలు పడుతుంది. ఇయర్‌బడ్స్, కేస్ రెండింటినీ కలిపి ఛార్జ్ చేసేందుకు సుమారు 90 నిమిషాలు పడుతుంది. ఛార్జింగ్ కేస్‌లో USB టైప్-C పోర్ట్ కూడా ఉంది.
ఈ ఇయర్‌బడ్స్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP55 రేటింగ్ ఉంది. నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్‌బడ్స్ ఒక్కొక్కటి సుమారుగా 4.4 గ్రాముల బరువు ఉంటాయి. అయితే, ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం బరువు సుమారుగా 43 గ్రాములు ఉంటుంది. ఇయర్‌బడ్స్ కొలతలు (31 x 20 x 17.52 మి.మీ), ఛార్జింగ్ కేస్ కొలతలు (60.00 x 49.64 x 25.04 మి.మీ) ఉంటాయి.
