Samsung Galaxy A35 : బిగ్ డిస్కౌంట్ బ్రో.. రూ. 33వేల ఈ శాంసంగ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ రూ. 19వేల లోపే..!
Samsung Galaxy A35 : శాంసంగ్ ఫోన్ ఆఫర్ అదిరింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 13,500 తగ్గింపుతో లభిస్తోంది. ఇలా కొన్నారంటే రూ. 19వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy A35 : కొత్త శాంసంగ్ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. రూ. 20,000 బడ్జెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ మీకోసమే. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35పై అద్భుతమైన డీల్ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 19వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ట్రిపుల్-కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఎలా కొనాలి? డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ A35 ధర డీల్ : ఈ శాంసంగ్ ఫోన్ లాంచ్ ధర రూ. 32,999 ఉండగా ఇప్పుడు రూ. 19,999 లోపు తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. ధర రూ. 18,999కి తగ్గుతుంది.

మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. రూ. 15,950 వరకు ఎక్స్చేంజ్ వాల్యూను పొందవచ్చు. మీ ఫోన్ వాల్యూ కండిషన్ బట్టి రేటు మారుతుంది. ఫ్లిప్‌కార్ట్ యూజర్లు నెలకు రూ. 3,334 ఈఎంఐతో కొనేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులను బట్టి నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందవచ్చు. ఎక్స్టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్ కూడా పొందవచ్చు.

మీరు కొనాలా వద్దా? : సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలంటే ఈ మిడ్-రేంజ్ ఫోన్ కొనేసుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. 1,900 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూ, 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15తో వస్తుంది.

6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు, 6 జనరేషన్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. ఈ ఫోన్లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. మంచి బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5MP మాక్రో లెన్స్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంది.
