OnePlus Nord CE 6 Series : కొత్త వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 సిరీస్ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లపై భారీ అంచనాలు.. ఫుల్ డిటెయిల్స్

OnePlus Nord CE 6 Series : వన్‌ప్లస్ నుంచి నార్డ్ సీఈ 6 సిరీస్ వచ్చేస్తోంది. డ్యూయల్-యాక్సిస్ ఓఐఎస్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ సెన్సార్, 32MP ఫ్రంట్ కెమెరా ఉంటాయని అంచనా. పూర్తి వివరాలు భారీ అంచనాలివే..

OnePlus Nord CE 6

  • వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6లో 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ
  • డైమెన్సిటీ 7400 అపెక్స్, 144Hz ప్యానెల్ ఆప్షన్
  • రూ. 25వేల లోపు స్టాండర్డ్ మోడల్‌ ధర రూ. 30వేలు

OnePlus Nord CE 6 Series : వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. భారత మార్కెట్లో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఇ 6, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్‌ ప్రవేశపెట్టేందుకు రెడీగా ఉంది. ఈ రెండు ఫోన్లలో ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు ఉండవచ్చు. అమెజాన్, వన్‌ప్లస్ ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.

మే 7న లాంచ్‌కు ముందు ఈ వన్‌ప్లస్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్ పొందవచ్చు. ఈ ఫోన్లలో స్పెసిఫికేషన్లు, ధరలపై ఓసారి లుక్కేయండి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6, నార్డ్ సీఈ 6 లైట్ స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుందని ధృవీకరించింది. 1,800 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ అందించే 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, ఎంపిక చేసిన టైటిల్స్‌లో 144Fపీఎస్ గేమ్‌ప్లేకు సపోర్టు అందిస్తుంది.

Read Also : Oppo Find X8 Pro : ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ. 19వేలు డిస్కౌంట్.. ఈ డీల్ అస్సలు వదులుకోవద్దు!

ఈ వన్‌ప్లస్ ఫోన్ 8,000mAh బ్యాటరీ ఉండవచ్చు. కెమెరా విషయానికొస్తే.. ఇందులో డ్యూయల్-యాక్సిస్ ఓఐఎస్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ సెన్సార్, 32MP ఫ్రంట్ కెమెరా ఉంటాయని అంచనా.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్ 144Hz ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని చెబుతున్నారు. ఈ వన్‌ప్లస్ 7,000mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం. కెమెరా హార్డ్‌వేర్‌లో 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 32MP సెల్ఫీ షూటర్ ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఇ 6 నార్డ్ సీఇ 6 లైట్ ధర (అంచనా) :
ధరల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ భారత మార్కెట్లో రూ. 25వేల లోపు ధరతో లాంచ్ అవుతుందని అంచనా. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ధర సుమారు రూ. 30వేలు మార్కు వద్ద ఉండే అవకాశం ఉంది. అయితే, కచ్చితమైన ధర, స్పెసిఫికేషన్లు లాంచ్ రోజున వెల్లడి కానున్నాయి.