Oppo A6c Flipkart Deal : ఖతర్నాక్ ఆఫర్.. ఈ ఒప్పో ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?
Oppo A6c Flipkart Deal : ఒప్పో A6c ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఒప్పో మోడల్ పై ఏకంగా రూ. 13వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- August 16, 2026 / 06:45 PM IST
Oppo A6c Flipkart Deal
- ఒప్పో A6c ఫోన్ 7000mAh బ్యాటరీ
- డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
- ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్
Oppo A6c Flipkart Deal : సూపర్ ఫోన్ భయ్యా.. ఒప్పో కొత్త ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఒప్పో A6c చౌకైన ధరకే లభిస్తోంది. గత మేలో భారత మార్కెట్లో ఈ ఒప్పో ఫోన్ లాంచ్ కాగా ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
ఈ ఫోన్‌లో 6.75-అంగుళాల డిస్‌ప్లే ఉంది. 7000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ఆఫర్‌తో లభిస్తోంది. ఒప్పో A6c ఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ :
ఒప్పో A6c ఫోన్‌ను కంపెనీ రూ. 29,999 ధరతో లాంచ్ చేయగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌తో అందిస్తోంది. అసలు ధరపై 43శాతం డిస్కౌంట్‌తో లిస్ట్ చేసింది. దాంతో అసలు ధర నుంచి రూ.16,999కే లభిస్తోంది. అంటే నేరుగా రూ. 13వేలు డిస్కౌంట్ పొందవచ్చు. అదే బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Read Also : Realme P4s Leak : భారీ బ్యాటరీతో కొత్త రియల్‌మి P4s వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
బ్యాంక్ డిస్కౌంట్ :
బ్యాంక్ ఆఫర్‌తో ఒప్పో A6c అతి చౌకైన ధరకే పొందవచ్చు. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే అదనంగా రూ. 1,325 డిస్కౌంట్ పొందవచ్చు.
ఒప్పో A6c స్పెసిఫికేషన్లు :
ఒప్పో A6c ఫోన్ 720 × 1570 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో A6c డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఆటోఫోకస్ సపోర్ట్‌తో 13MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో A6cలో USB టైప్-సి పోర్ట్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్‌లలో 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.2, GPS, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.
