Oppo Find X8 Pro Price : కొంటే ఒప్పో ఫోన్ కొనాలి.. అమెజాన్‌లో రూ. 20వేలకుపైగా డైరెక్ట్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే?

Oppo Find X8 Pro Price : ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో ఈ ఫోన్ నేరుగా రూ. 20వేలకు పైగా డిస్కౌంట్‌తో వస్తుంది. బ్యాంకు ఆఫర్లతో ధర రూ. 76,990కి తగ్గింపు పొందవచ్చు.

Oppo Find X8 Pro Price

  • అమెజాన్‌లో ఒప్పో ఫైండ్ X8 ప్రో భారీ తగ్గింపు
  • బ్యాంకు ఆఫర్లతో ధర రూ. 76,990కి డిస్కౌంట్
  • 4 రియర్ కెమెరాలు, 120Hz డిస్‌ప్లేతో వస్తుంది

Oppo Find X8 Pro Price : ఒప్పో ఆఫర్ అదుర్స్.. కంపెనీ ఒప్పో ఫైండ్ X10 సిరీస్‌ అతి త్వరలో లాంచ్ చేయనుంది. అంతకన్నా ముందే ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 99,999 ధరతో లాంచ్ కానుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 80వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ధర ఇంకా తగ్గాలంటే.. బ్యాంక్ కార్డు ఆఫర్లు ఎంచుకోవచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. అమెజాన్‌లో ఒప్పో ఫైండ్ X8 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఒప్పో ఫైండ్ X8 ప్రో అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో రూ. 99,999 ధరతో లాంచ్ అయింది. కానీ, అమెజాన్ ప్రస్తుతం (Oppo Find X8 Pro Price) కేవలం రూ. 79,990కే విక్రయిస్తోంది. ప్రారంభ ధరపై రూ. 20,009 నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది.
ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 3వేలు ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 76,990కి తగ్గుతుంది. అమెజాన్ నెలకు కేవలం రూ. 2,812తో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రైమ్ యూజర్లు సింగిల్ డేలో డెలివరీ పొందవచ్చు.

Read Also : Google Pixel 10 Price : ఏంది భయ్యా ఈ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10 మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో ధర జస్ట్..!

ఈ ఫోన్ కొనాలా వద్దా? :
ఈ ఒప్పో ఫోన్ కొనాలా వద్దా అంటే.. కెమెరాకు ఎక్కువ ప్రాయారిటీ ఇచ్చేవారు అయితే కచ్చితంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒప్పో ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 50MP సోనీ LYT808 ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT600 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 6x ఆప్టికల్ జూమ్ 120x వరకు డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ IMX858 టెలిఫోటో కెమెరా, 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ కెమెరా లభిస్తాయి.

అంతేకాదు.. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఇందులో 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందుకోగలదు.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈజీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 5,910mAh బ్యాటరీతో వస్తుంది. 80W వైర్డ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.