Oppo Find X9 Series : కొత్త ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, కీలక స్పెషిఫికేషన్లు, ధర వివరాలివే..

Oppo Find X9 Series : కొత్త ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్, స్పెషిఫికేషన్లు, ఇతర కీలక ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.

Oppo Find X9 Series

Oppo Find X9 Series : ఒప్పో నుంచి సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. అతి త్వరలో నెక్స్ట్ బిగ్ ఫ్లాగ్‌షిప్ ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌ను ఆవిష్కరించేందుకు రెడీగా ఉంది. కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ జౌ యిబావో నుంచి రాబోయే ఫోన్ కొన్ని కీలక ఫీచర్లు రివీల్ అయ్యాయి. స్టాండర్డ్ ఫైండ్ X9 7,025mAh గ్లేసియర్ బ్యాటరీతో వస్తుందని అంచనా. అయితే, ఒప్పో ఫైండ్ X9 ప్రో భారీ 7,500mAh యూనిట్‌ను కలిగి ఉంటుంది.

ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 80W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తాయని (Oppo Find X9 Series) చెబుతున్నారు. ఆసక్తికరంగా, ఒప్పో ఈ వివరాలను ఐఫోన్ 17 లాంచ్ సమయంలోనే వెల్లడించింది. రాబోయే ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రో గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఒప్పో ఫైండ్ X9 5G భారత్ లాంచ్ తేదీ (అంచనా) :
ఒప్పో ఫైండ్ X9 సిరీస్ అక్టోబర్ మధ్య నాటికి చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Read Also : Royal Enfield : కొత్త బుల్లెట్ బైక్ కావాలా? రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల ధరలు తగ్గాయోచ్.. ఏ వేరియంట్ ధరలు ఎంత తగ్గాయంటే?

ఒప్పో ఫైండ్ X9 5G స్పెక్స్ (అంచనా) :
ఒప్పో ఫైండ్ X9 కేవలం 7.99mm కొలతలు, 203 గ్రాముల బరువు కలిగి ఉంటుందని అంచనా. ఒప్పో ప్రో ఎడిషన్ 8.25mm కొలతలు, 224 గ్రాముల బరువు ఉంటుందని అంచనా. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు కోల్డ్ కార్వింగ్ టెక్నాలజీ, టైటానియం కలర్ ఆప్షన్, కర్వడ్ ఫోర్ సైడ్ స్ట్రెయిట్ స్క్రీన్ డిస్ప్లేలతో వస్తాయి. ఇమేజింగ్ సైడ్.. ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో రెండూ పాపులర్ ఇమేజింగ్ టెక్నాలజీతో అడ్వాన్స్ కెమెరా సెటప్‌తో ఉంటాయి.

గతంలో, స్టాండర్డ్ మోడల్‌లో OISతో 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ JN5 అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, OISతో 50MP శాంసంగ్ JN9 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ హ్యాండ్‌సెట్ అప్‌గ్రేడ్ 50MP శాంసంగ్ JN1 సెన్సార్‌ కలిగి ఉండవచ్చు. ఈ ఒప్పో ఫోన్లు ColorOS16తో ప్రీ-ఇన్‌స్టాల్ కలిగి ఉంటాయి.