Oppo Find X9 Price : వావ్.. ఈ ఒప్పో ఫోన్ చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 22వేలు డిస్కౌంట్..!

Oppo Find X9 Price Drop : ఒప్పో ఫైండ్ ఎక్స్9 ధర భారీగా తగ్గింది. ఈ ఒప్పో ఫోన్ కొనుగోలుపై రూ. 22వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంత తగ్గిందంటే?

Oppo Find X9 Price

  • ఒప్పో ఫైండ్ X9 ఫోన్ ధర భారీగా తగ్గింది
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఫైండ్ X9 పై రూ. 22,220 డైరెక్ట్ డిస్కౌంట్
  • బ్యాంకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా

Oppo Find X9 Price Drop : కొత్త ఒప్పో ఫోన్ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్.. రూ. 60వేల లోపు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 డీల్‌ అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ అధికారిక ధర రూ. 84,999 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది. ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 6.59-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ (Oppo Find X9 Price) డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఫీచర్లతో వస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఒప్పో ఫైండ్ X9 డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X9 ఫోన్ అధికారిక ధర రూ. 84,999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫైండ్ X9పై రూ. 22,220 డైరెక్ట్ ధర డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ధర రూ. 62,779కి తగ్గింది.
అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 3,139 ఆదా చేసుకోవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

ఒప్పో ఫైండ్ X9లో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ప్యానెల్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్‌కు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. 80W వైర్డ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,025mAh బ్యాటరీ అందిస్తుంది. 10W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

Read Also : Samsung Galaxy S25 FE : సూపర్ డిస్కౌంట్ మావా.. ఈ శాంసంగ్ ఫోన్ మరి ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!

ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. :
ఒప్పో ఫైండ్ X9లో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ (సోనీ LYT-808, ఎఫ్/1.6, OIS), 50MP అల్ట్రావైడ్ (శాంసంగ్ JN5, f/2.0) 50MP పెరిస్కోప్ టెలిఫోటో (సోనీ LYT-600, 3x ఆప్టికల్ జూమ్, f/2.6, OIS) ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంది.

కొనాలా వద్దా? :
మంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో ఫైండ్ X9 అద్భుతమైన ఆప్షన్. ప్రీమియం డిజైన్‌, ఆకట్టుకునే డిస్‌ప్లే, మంచి కెమెరా, బ్యాటరీతో ఇంత కన్నా తక్కువ ధరకు దొరక్కపోవచ్చు.
అందులోనూ ఈ ఒప్పో ఫోన్ రోజువారీ వాడకానికి అద్భుతంగా ఉంటుంది. కెమెరా, పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ పరంగా చూస్తే చాలా బెస్ట్.. ఒప్పో ఫైండ్ X9 ఫోన్ తగ్గినప్పుడే కొనేసుకోవడం బెటర్.