Oppo Find X9 Ultra : అమెజాన్ బంపర్ ఆఫర్.. ఒప్పో అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఈ క్రేజీ డీల్ డోంట్ మిస్..!

Oppo Find X9 Ultra : ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా ఫోన్ అదిరింది.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ అదిరే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Oppo Find X9 Ultra

  • ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా అధికారిక ధర రూ. 1,69,999
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు
  • ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 18వేలు తగ్గింపు
  • కోటక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 17వేలు తగ్గింపు

Oppo Find X9 Ultra : వారెవ్వా.. ఒప్పో ఫోన్ ఆఫర్ అదిరింది.. మీరు మంచి ఫ్లాగ్ షిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఇంతకన్నా బెస్ట్ టైమ్ మరొకటి ఉండదు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ సందర్భంగా ఈ స్మార్ట్ డీల్ సొంతం చేసుకోవచ్చు. మీరు కెమెరా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా తీసుకోవచ్చు.

ప్రస్తుత అమెజాన్ ఆఫర్‌తో ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ కొనుగోలుపై రూ. 18వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఫైండ్ ఎక్స్9 అల్ట్రా అధికారిక ధర రూ. 1,69,999 ఉండగా 6.82-అంగుళాల డిస్‌ప్లే, 7,050mAh బ్యాటరీ, 200MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది. ఫోన్ కీలక స్పెసిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి..

ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా డీల్ :
ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా అధికారిక ధర రూ. 1,69,999 ఉండగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఈ ఒప్పో ఫోన్‌ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ. 18వేలు తగ్గింపు పొందొచ్చు. కోటక్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 17వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఆదా చేయాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.

ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రాలో 6.82-అంగుళాల QHD+ ProXDR అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 3,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఒప్పో ఫోన్ 7,050mAh బ్యాటరీతో వస్తుంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Multiple Credit Cards : మల్టిపుల్ క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి!

ఫొటోగ్రఫీ కోసం ఫైండ్ X9 అల్ట్రాలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అమర్చారు. ఇందులో 200MP మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. ప్రత్యేకంగా 10x ఆప్టికల్ జూమ్ 50MP పెరిస్కోప్ లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఒప్పో X9 అల్ట్రా ఫ్రంట్ సైడ్ 50MP కెమెరాతో వస్తుంది. అంతేకాదు.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫోన్ IP66, IP68, IP69 మన్నిక రేటింగ్‌లతో పాటు అనేక ఏఐ ఆధారిత ప్రొడక్టివిటీ ఇమేజింగ్ ఫీచర్లతో వస్తుంది.

ఒప్పో అల్ట్రా ఫోన్ కొనాలా వద్దా? :
ఫొటోగ్రఫీ కోసం ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా అద్భుతంగా ఉంటుంది. మల్టీఫేస్ కెమెరా సిస్టమ్, 10x ఆప్టికల్ జూమ్, ఆకట్టుకునే పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీ తక్కువ లైటింగ్‌లో కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ అదిరే డిస్‌ప్లే, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ కూడా అందిస్తుంది. అయితే, ఒప్పో అల్ట్రా ఫోన్ ధర రూ. 1,69,999 ధర చాలా ఎక్కువ.. ఇంత పెట్టి ఒప్పో ఫోన్ కొనాలంటే సామాన్యులు కాస్తా ఆలోచించాల్సిందే..