Oppo K13 Turbo Series : ఒప్పో నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. K13 టర్బో సిరీస్ లాంచ్ ఎప్పుడంటే? ధర, ఫీచర్లు వివరాలివే..!

Oppo K13 Turbo Series : ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. ఒప్పో K13 టర్బో ఒప్పో K13 టర్బో ప్రో ఫోన్లు లాంచ్ కానున్నాయి.

Oppo K13 Turbo Series : ఒప్పో నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. K13 టర్బో సిరీస్ లాంచ్ ఎప్పుడంటే? ధర, ఫీచర్లు వివరాలివే..!

Oppo K13 Turbo Series launch

Updated On : July 23, 2025 / 1:26 PM IST

Oppo K13 Turbo Series : ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్ రాబోతుంది. వచ్చే నెల ఆగస్టులో భారత మార్కెట్లో ఒప్పో K13 టర్భో, ఒప్పో K13 టర్బో ప్రో లాంచ్ (Oppo K13 Turbo Series) కానున్నాయి. అయితే, ఒప్పో అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. కానీ, ఈ రెండు ఒప్పో ఫోన్లు ఆగస్టు మొదటి లేదా రెండవ వారంలో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.

ఈ ఫోన్లు చైనీస్ మోడళ్లకు సమానమైన స్పెసిఫికేషన్లతో రావచ్చు. యాక్టివ్ కూలింగ్ కోసం బిల్ట్-ఇన్ ఫ్యాన్‌, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లతో ఉండవచ్చు. డిజైన్ కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే ఒప్పో ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఒప్పో K13 టర్బో, K13 టర్బో ప్రో స్పెసిఫికేషన్లు :
నివేదికల ప్రకారం.. ఒప్పో K13 టర్బో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8450 చిప్‌సెట్‌తో రానుంది. ఒప్పో K13 టర్బో ప్రో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో రానుందని తెలుస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల 1.5K అమోల్డ్ ప్యానెల్‌తో రావచ్చు. ఈ ఒప్పో ఫోన్లు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తాయి.

Read Also : Airtel vs Jio vs BSNL : విదేశాలకు వెళ్తున్నారా? రూ. 2వేల లోపు బెస్ట్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లు.. ఎయిర్‌టెల్, జియో, BSNL ఏది కావాలి?

ఆండ్రాయిడ్ 15-ఆధారిత యూఐలో రన్ అవుతాయి. ఎయిర్ డక్ట్‌లు, ఇన్‌బిల్ట్ ఫ్యాన్‌లు, 7,000 చదరపు మి.మీ స్టీమ్ రూమ్ కూడా ఉండవచ్చు. IPX6+IPX8+IPX9 రేటింగ్‌లను పొందవచ్చు. కెమెరాల విషయానికొస్తే.. ఈ డివైజ్‌లలో 50MP ప్రైమరీ షూటర్‌తో పాటు 2MP సెకండరీ లెన్స్‌లు ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ డివైజ్‌లలో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉండవచ్చు.

ఒప్పో K13 టర్బో, K13 టర్బో ప్రో ధర (అంచనా) :
చైనాలో ఒప్పో K13 టర్బో ఫోన్ CNY 1,799 (సుమారు రూ. 21,600) ధరకు లాంచ్ కాగా, ప్రో వేరియంట్ CNY 1,999 (సుమారు రూ. 24,000) ధరకు లాంచ్ అయింది. అయితే, భారత మార్కెట్లో ఈ ప్రో ఫోన్ ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఒప్పో K13 టర్బో ప్రో దాదాపు రూ. 30వేలు, స్టాండర్డ్ ఒప్పో K13 టర్బో ధర దాదాపు రూ. 25వేల వరకు ఉండొచ్చు.