Oppo K13 Turbo Pro 5G : పండగ చేస్కోండి.. ఈ ఒప్పో 5G ఫోన్ చాలా చీప్ గురూ.. ఏకంగా రూ. 12వేలు తగ్గింపు!
Oppo K13 Turbo Pro 5G : ఈ ఒప్పో K13 టర్బో ప్రో 5జీ ఫోన్ డిస్కౌంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందిస్తోంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- August 1, 2026 / 05:36 PM IST
Oppo K13 Turbo Pro 5G
- ఒప్పో K13 టర్బో ప్రో 5జీ తగ్గింపు ధరకే లభిస్తోంది
- అసలు ధరపై రూ. 11వేలు డైరెక్ట్ డిస్కౌంట్ పొందొచ్చు
- ఈ 5జీ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు
Oppo K13 Turbo Pro 5G : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో K13 టర్బో ప్రో 5జీ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ప్రస్తుతం ప్రతి మొబైల్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా పెంచేస్తున్నాయి. కానీ, కొన్ని బ్రాండ్ల ఫోన్లు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి.
ఒప్పో K13 టర్బో ప్రో 5జీ ఫోన్ అసలు ధర కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ తగ్గింపుతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్ (Oppo K13 Turbo Pro 5G) కూడా పొందవచ్చు. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఒప్పో K13 టర్బో ప్రో 5జీపై బెస్ట్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
డిస్కౌంట్ ఆఫర్ :
ఒప్పో K13 టర్బో ప్రో 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 41,999గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను 26శాతం తగ్గింపుతో ఆఫర్ చేస్తోంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 30,999కి తగ్గింది. అంటే.. అసలు ధర నేరుగా రూ. 11వేలు తగ్గినట్టే..
Read Also : Vivo V70 Series : వివో ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. భారీగా పెరిగిన వివో ఫోన్ల ధరలు.. కొత్త రేట్లు ఇవే
సేల్, బ్యాంక్ ఆఫర్లు :
ఈ ఒప్పో 5జీ ఫోన్ కొనుగోలుపై అనేక బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. మీరు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులతో ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 1,500 వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా మీ ఫోన్ ధర రూ. 29,499కి తగ్గుతుంది. ఈ ఫోన్ అసలు ధర కన్నా రూ. 12వేలకుపైగా తక్కువకే కొనేసుకోవచ్చు.
ఒప్పో K13 టర్బో ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఒప్పో K13 టర్బో ప్రో ఫోన్ 6.80-అంగుళాల ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1,600 నిట్స్ వరకు గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఒప్పో K13 టర్బో ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్ 15తో వస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
ఒప్పో కె13 టర్బో ఫోన్ బ్యాక్ సైడ్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 7,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, NFC, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
