Oppo K14 Plus Sale : ఒప్పో K14 ప్లస్ సేల్ మొదలైందోచ్.. ఇలా కొన్నారంటే చాలా చీపెస్ట్ ధరకే..!
Oppo K14 Plus Sale : 8000mAh భారీ బ్యాటరీతో ఒప్పో K14 ప్లస్ సేల్ మొదలైంది. అన్ని బ్యాంకులలో రూ. 4వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. పూర్తి ఆఫర్, ధర వివరాలివే..
- Sreehari A
- Published on- October 8, 2026 / 04:02 PM IST
Oppo K14 Plus Sale
- భారత్‌లో కొత్త ఒప్పో K14 ప్లస్ ధర రూ. 29,999 నుంచి ప్రారంభం
- కొనుగోలుదారులు ఫస్ట్ సేల్ రోజే రూ. 4వేలు ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మాక్స్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది
Oppo K14 Plus Sale : కొత్త ఒప్పో ఫోన్ కొంటున్నారా? గత నెలలో లాంచ్ అయిన ఒప్పో K14 ప్లస్ ఇప్పుడు భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఫస్ట్ డే కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఈ కొత్త ఒప్పో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP మెయిన్ కెమెరా ఉంది. ఒప్పో K14 ప్లస్‌లో 45W ఛార్జింగ్‌తో 8,000mAh బ్యాటరీ కూడా ఉంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
భారత్‌లో ఒప్పో K14 ప్లస్ ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో ఒప్పో K14 ప్లస్ 6GB ర్యామ్, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. 8GB + 128GB 8GB + 256GB ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లలో కూడా లభిస్తుంది. దాంతో ధరలు వరుసగా రూ. 32,999 రూ. 35,999కు పొందవచ్చు.
Read Also : Vivo Y32 Launch : కొత్త వివో ఫోన్ కేక.. భారీ బ్యాటరీతో దుమ్మురేపుతోంది.. ధర మీ బడ్జెట్‍లోనే..
కొనుగోలుదారులు అన్ని బ్యాంకులలో రూ. 4వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ధరలు వరుసగా రూ. 25,999, రూ. 28,999 రూ. 31,999కు తగ్గుతాయి. ఈ ఆఫర్‌తో పాటు 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. ఒప్పో K14 ప్లస్ సోలార్ ఆరెంజ్ స్టార్ వైట్ కలర్ ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్ ఒప్పో ఇండియా ఇ-స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది.
ఒప్పో K14 ప్లస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఒప్పో K14 ప్లస్ 6.77-అంగుళాల FHD+ (2,772 × 1,272 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుంది. అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్ గరిష్టంగా 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది.
ఈ ఫోన్‌లో ఎఫ్/1.8 అపర్చర్ 2-యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. పోర్ట్రెయిట్ మోడ్‌లో డెప్త్ మ్యాపింగ్ కోసం 2MP మోనోక్రోమ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం ఎఫ్/2.4 అపర్చర్‌తో 16MP కెమెరాతో వస్తుంది.
ఒప్పో K14 ప్లస్‌లో 8,000mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒప్పో కలర్‌ఓఎస్ 16తో రన్ అవుతుంది. యాక్సెసరీల కోసం 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒప్పో K14 ప్లస్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డిస్‌ప్లేలోనే వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 162.6 × 77.6 × 8.4 మిమీ, బరువు 207 గ్రాములు ఉంటుంది.
