Oppo Reno 14 5G Diwali Edition
Oppo Reno 14 5G Diwali Edition : ఒప్పో అభిమాను కోసం అదిరిపోయే కొత్త ఫోన్ వచ్చేసింది. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో అధికారికంగా భారత మార్కెట్లో రెనో 14 5G దీపావళి ఎడిషన్‌ను ప్రకటించింది. ఈ పండుగ వేరియంట్ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ మండల, నెమలి-ప్రేరేపిత డిజైన్ కలిగి ఉంది.
దీపావళి దియాల జ్వాల ఆకారపు డిజైన్ (Oppo Reno 14 5G Diwali Edition) ప్రత్యేక ఆకర్షణగా ఉంది. దేశంలోనేమొట్టమొదటి హీట్ సెన్సిటివ్ కలర్ చేంజేంగ్ బ్యాక్ ప్యానెల్ కూడా కలిగి ఉంది. అంతేకాదు. శరీర వెచ్చదనం తగలగానే బ్లాక్ కలర్ నుంచి గోల్డ్ కలర్‌లోకి మారుతుంది. ఒప్పో రెనో 14 5G దీపావళి ఎడిషన్ ధర, స్పెసిఫికేషన్‌లు, ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Oppo Reno 14 5G Diwali Edition
ఒప్పో రెనో 14 5G దీపావళి ఎడిషన్ ఫోన్ 6.59-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ ఒప్పో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 6,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కలర్ OS15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. ఏఐ ట్రాన్స్‌లేట్, ఏఐ వాయిస్‌స్క్రైబ్, ఏఐ మైండ్ స్పేస్, సర్కిల్ టు సెర్చ్, జెన్ఏఐ ఇంటిగ్రేషన్ వంటి ఏఐ ఫీచర్లతో వస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. ఈ ఒప్పో రెనో 14 5G ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఒప్పో ఫోన్ 50MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. మన్నిక విషయానికి వస్తే.. ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i కలిగి ఉంది. IP66, IP68, IP69 సర్టిఫైడ్, ఆల్‌రౌండ్ ఆర్మర్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది.
ఒప్పో రెనో 14 5G దీపావళి ఎడిషన్ ధర, ఆఫర్లు :
ఒప్పో రెనో 14 5G దీపావళి ఎడిషన్ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999కు పొందవచ్చు. పండుగ డిస్కౌంట్ తర్వాత ధర రూ.36,999కు కొనుగోలు చేయొచ్చు. ఒప్పో స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనేసుకోవచ్చు. జియో రూ.1,199 ప్రీపెయిడ్ ప్లాన్‌తో కొనుగోలుదారులు రూ.5,200 విలువైన గూగుల్ వన్ 2TB క్లౌడ్ + జెమిని అడ్వాన్స్‌డ్ 3 నెలలు ఉచితంగా పొందవచ్చు. 10 ఓటీటీ యాప్‌లకు 6 నెలల ఫ్రీ ప్రీమియం యాక్సెస్ కూడా పొందవచ్చు.