ఒప్పో రెనో సిరీస్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్లు గ్లోబల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రెనో 14, రెనో 14 ప్రో మోడల్స్ చైనాలో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం.. భారత్‌లో రెనో 14, రెనో 14 ప్రో మోడల్స్ జూలై ప్రారంభంలో మార్కెట్‌లోకి రానున్నాయని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఒప్పో ‘బోల్డ్ కమ్‌బ్యాక్’ అనే టీజర్ మాత్రమే విడుదల చేసినప్పటికీ.. ప్రముఖ లీకర్ యోగేశ్ బ్రార్ అందించిన వివరాల ప్రకారం.. రెనో 14, రెనో 14 ప్రో మోడల్స్ త్వరలోనే ప్రపంచ మార్కెట్లో రిలీజ్ కానున్నాయి.
భారత్‌లో రిలీజ్ టైమ్‌లైన్, ధర
జూలై మొదటి వారంలోనే రెనో 14 సిరీస్ భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో విడుదలైన రెనో 13 సిరీస్‌లో 5జీ వేరియంట్ ధర రూ.37,999 నుంచి ప్రారంభమైంది. అలాగే, ప్రో మోడల్ రూ.49,999 నుంచి ప్రారంభమైంది. చైనా మార్కెట్‌లో రెనో 14 ధర సుమారు రూ.33,600, రెనో 14 ప్రో ధర సుమారు రూ.42,000గా ఉంది. భారత్‌లోనూ ఇదే ధర ఉండే అవకాశం ఉంది.
డిస్‌ప్లే, డిజైన్
రెనో 14లో 6.59 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌రేట్, క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ప్రో మోడల్ 6.83 అంగుళాల డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్‌రేట్, 1,200 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
పెర్ఫార్మెన్స్
రెనో 14లో డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉపయోగించగా, ఇది రెనో 13 5జీలోనూ ఉన్నదే. ప్రో వేరియంట్‌లో డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంటుంది.
కెమెరాలు
ఈ సారి కెమెరా సెటప్‌ను ఓప్పో భారీగా అప్‌గ్రేడ్ చేసింది. రెనో 14లో 50MP మెయిన్ (OIS), 50MP టెలిఫొటో, 8MP అల్ట్రావైడ్, 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ప్రో మోడల్‌లో 3.5x ఆప్టికల్ జూమ్ కలిగిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్, అదే 50MP మెయిన్, సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి.
బ్యాటరీ, చార్జింగ్, మెమొరీ
రెనో 14లో 6,000mAh బ్యాటరీ 80W సూపర్ ఫ్లాష్ చార్జింగ్‌తో వస్తే, ప్రో మోడల్లో 6,200mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. రెండు మోడల్స్‌లోనూ గరిష్ఠంగా 16GB LPDDR5X RAM, 1TB వరకూ UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.