Poco C55 India Launch : ఫిబ్రవరి 21న పోకో C55 స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ సేల్ ఎప్పుడంటే?

Poco C55 India Launch : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఫిబ్రవరి 21న భారత మార్కెట్లో పోకో C55 మోడల్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు పోకో కంపెనీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. రాబోయే పోకో C55 హ్యాండ్‌సెట్ గతంలో Poco India ఇండియా ప్రమోషనల్ వీడియో ద్వారా రివీల్ చేసింది.

Poco C55 India Launch Date Set for February 21, to Be Sold via Flipkart_ All Details

Poco C55 India Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఫిబ్రవరి 21న భారత మార్కెట్లో పోకో C55 మోడల్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు పోకో కంపెనీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. రాబోయే పోకో C55 హ్యాండ్‌సెట్ గతంలో Poco India ఇండియా ప్రమోషనల్ వీడియో ద్వారా రివీల్ చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో అనేక సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలోనూ కనిపించింది. గత నివేదికలతో పోలిస్తే.. రాబోయే Poco C55 రీబ్రాండెడ్ Redmi 12C అని కంపెనీ సూచిస్తోంది. చైనాలో జనవరిలో Redmi 12C ఫోన్ లాంచ్ అయింది. Redmi 10Cకి సక్సెసర్‌గా వచ్చిన ఈ ఫోన్ MediaTek Helio G85 SoC ద్వారా రన్ అవుతుంది. చైనాలో మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ త్వరలో గ్లోబల్ వేరియంట్‌లో కూడా లాంచ్ కానుంది.

Read Also : Poco X5 Pro Sale : భారత్‌లో పోకో X5 ప్రో ఫోన్ సేల్ మొదలైందోచ్.. ఈ 5G ఫోన్ ఎందుకు కొనాలంటే? ఇదిగో మూడు కారణాలు..!

ఈ హ్యాండ్‌సెట్ రాకను పోకో ఇండియా (Poco India) ట్వీట్ ద్వారా ధృవీకరించింది. Poco C55 ఫిబ్రవరి 21న భారత్‌లో లాంచ్ కానుందని సంస్థ తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. గత నివేదిక ప్రకారం.. Poco C55 రీబ్రాండెడ్ Redmi 12C మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ C-సిరీస్ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ జనవరిలో చైనాలో లాంచ్ అయింది. 4GB + 64GB, 4GB + 128GB, 6GB + 128GB వంటి మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉండనుంది. షాడో బ్లాక్, సీ బ్లూ, మింట్ గ్రీన్, లావెండర్ అనే నాలుగు కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.

Poco C55 India Launch Date Set for February 21, to Be Sold via Flipkart

Redmi 12C 6.71- అంగుళాల HD+ (1650×720 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను 20:6:9 యాస్పెక్ట్ రేషియో, 500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (Nano) స్లాట్‌తో రిలీజ్ అయింది. ఈ డివైజ్ ఆక్టా-కోర్ MediaTek Helio G85 SoC, Mali-G52 GPUతో వచ్చింది. పోకో డివైజ్ LPDDR4X RAM, eMMC 5.1 ఫ్లాష్ మెమరీని కలిగి ఉంది.

Redmi 12C స్టోరేజీతో మైక్రో SD కార్డ్ ద్వారా మూడు ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌లలో 512GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో రెక్టాంగిల్ కటౌట్ ఉంది. ఇందులో పిల్ ఆకారపు సింగిల్ కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. బయోమెట్రిక్ ధృవీకరణకు ఫింగర్‌ఫ్రింట్ స్కానర్ కెమెరా యూనిట్ ఉంది. Redmi 12C 50-MP ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ ముందు భాగంలో డ్యూ-డ్రాప్ నాచ్‌లో 5-MP కెమెరా సెన్సార్ ఉంది.

Read Also : Twitter 2FA Setup : వచ్చే మార్చి నుంచి ట్విట్టర్‌ యూజర్లు ఛార్జీలు చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?