Poco C65 First Sale : ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సి65 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర కేవలం రూ.7,499 మాత్రమే!

Poco C65 First Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకే పోకో సి65 ఫోన్ అందుబాటులో ఉంది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Poco C65 Sale form Today on Flipkart _ Know Features, Specification and Price, Full Details

Poco C65 First Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం అత్యంత సరసమైన ధరకే పోకో సి65 ఫోన్ అందుబాటులో ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోకో సి65 ఫోన్ డిసెంబర్ 18 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్‌ పొందాలంటే కొనుగోలుదారులు కేవలం రూ.7,499 చెల్లిస్తే సరిపోతుంది. అనేక బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. పూర్తివివరాల కోసం ఓసారి లుక్కేయండి.

Read Also : Redmi 13C vs Redmi 12C : రెడ్‌మి 13సి లేదా రెడ్‌మి 12సి ఫోన్లలో ఏది కొంటే బెటర్? ధర, ఫీచర్ల వివరాలివే..!

పోకో సి65 ఫోన్ మోడల్ డిసెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. టెక్ ఔత్సాహికులు, వినియోగదారులు ఈ కొత్త గాడ్జెట్‌ను అనేక బ్యాంక్ ఆఫర్‌లు, డీల్స్ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ డివైజ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించగల స్పెషిఫికేషన్లను కలిగి ఉంది. శక్తివంతమైన ప్రాసెసర్ నుంచి అధిక-రిజల్యూషన్ కెమెరా వరకు అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.

పోకో సి65 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు :
పోకో సి65 అనేది మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్, ఈ ఫోన్ 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వంటి వేరియంట్‌లతో మూడు ఆప్షన్లను అందిస్తుంది. ప్రత్యేక మైక్రో ఎస్‌‌డీ కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి వినియోగదారులు స్టోరేజీని 1టీబీకి విస్తరించవచ్చు. మెమొరీ ఎక్స్‌టెన్షన్ టెక్నాలజీని ఉపయోగించి ర్యామ్‌ని 16జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

మల్టీ టాస్కింగ్, రెస్పాన్సివ్ యాప్ పర్పార్మెన్స్ అందిస్తుంది. పోకో సి65 వ్యూ ఎక్స్‌పీరియన్స్ 6.74 డాట్ డ్రాప్ డిస్‌ప్లే, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను చేరుకోగలదు. అన్‌లాకింగ్ కోసం సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఏఐ ఫేస్ అన్‌లాక్, ఎలక్ట్రానిక్ కంపాస్, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ వంటి కొన్ని ఇతర ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి.

పోకో సి65 ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా ఎంఐయూఐ 14 రన్ అవుతుంది. మ్యాట్ బ్లాక్, పాస్టెల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఫొటోగ్రఫీ ఔత్సాహికులు పోకో సి65 కెమెరా సామర్థ్యాలతో 50ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్, 50ఎంపీ, ఎఫ్/1.8 ఎపర్చర్‌తో కూడిన ప్రధాన కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా ఆకర్షణీయమైన ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు లెన్స్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ 8ఎంపీ కెమెరా, సాఫ్ట్-లైట్ రింగ్‌తో వస్తుంది. సెల్ఫీ ప్రియులు తక్కువ-కాంతి పరిస్థితుల్లో కూడా హై-క్వాలిటీ పోర్ట్రెయిట్‌లను తీయొచ్చు.

Poco C65 Sale form Today on Flipkart

పోకో సి65 ధర ఎంతంటే? :
పోకో సి65 ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 8,499కు కొనుగోలు చేయొచ్చు. మిడ్-స్పెక్ 6జీబీ+128జీబీ ఆప్షన్ ధర రూ.9,499 కాగా, టాప్-ఎండ్ 8జీబీ+256జీబీ మోడల్ ధర రూ.10,999కు సొంతం చేసుకోవచ్చు. ఈ ధర పోకో సి65 అసాధారణమైన విలువను అందిస్తుంది.

ప్రత్యేకించి విక్రయంలో అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్లతో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే లావాదేవీలపై కస్టమర్‌లు రూ. వెయ్యి తగ్గింపును పొందవచ్చు. అదేవిధంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లు కూడా వారి క్రెడిట్, డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై రూ.వెయ్యి తగ్గింపు నుంచి ప్రయోజనం పొందవచ్చు.

Read Also : Redmi 13C Sale Today : రెడ్‌మి 13సి ఫోన్ సేల్ మొదలైంది.. ఎక్కడ కొనాలి? లాంచ్ ఆఫర్ల వివరాలివే..!