Poco M3 Pro 5g
Poco M3 Pro 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి 5G స్మార్ట్ ఫోన్ రాబోతోంది. జూన్ 8న భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది. ఈ మోడల్ భారతీయ వేరియంట్ గ్లోబల్ వేరియంట్‌తో సమానంగా ఉంటుందని టాక్.. ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేకమైన పేజీని ఏర్పాటు చేసింది. FHD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని నిర్ధారిస్తుంది.
పోకో M3 ప్రో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుంది. 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. 5G స్మార్ట్‌ఫోన్‌కు మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌తో పాటు 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు 48MP కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో ఈ డివైస్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా 8MP ఉంటుంది.
Need for speed? We got you covered! 😉 #POCOM3Pro with Mad Speed, Killer Looks is launching on 8th June, at 11:30 AM on @Flipkart. pic.twitter.com/bMpJHuAk04
— POCO India – Register for Vaccine ?? (@IndiaPOCO) June 3, 2021
POCO M3 ప్రో జూన్ 8న భారతదేశంలో లాంచ్ అవుతుంది. గ్లోబల్ ప్రారంభ ధర 159 యూరోలకు లభ్యం కానుంది. భారత కరెన్సీలో ఈ మోడల్ ధర రూ.14వేల నుంచి రూ.15వేల మధ్య అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12లో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. పోకో M3 ప్రో కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో సహా 3 కలర్ వేరియంట్లలో రానుంది.