Poco X6 5G : భలే ఉంది భయ్యా ఫోన్.. రూ. 6వేలకే పోకో 5జీ ఫోన్ అంట.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Poco X6 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో పోకో X6 5G ఫోన్ భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఈ డీల్ మీ సొంతం చేసుకోండి..

Poco X6 5G available with Rs 6k discount

Poco X6 5G Discount on Amazon : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. అతి తక్కువ ధరలో పోకో 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో నుంచి పోకో X6 5జీ లేటెస్ట్ జనరేషన్ ఫోన్ ఇది.. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్ సామర్థ్యంతో పాటు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

మీరు రూ. కేవలం రూ. 20వేల లోపు పర్ఫార్మెన్స్ ఆధారిత ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ కలిగి ఉంటే.. కస్టమర్లు రూ. 6వేల వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు అనమాట.. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : RBI Repo Rate : లోన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఆర్బీఐ రేపో రేటు తగ్గించిందోచ్..!

పోకో X6 ధర, ఆఫర్లు :
ఆసక్తి గల కస్టమర్లు పోకో X6 ఫోన్ ధర రూ.17,998కి సొంతం చేసుకోవచ్చు. సాధారణ రేంజ్ కన్నా రూ.5వేల వరకు భారీ ధర తగ్గింపు పొందవచ్చు. మీకు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మీరు రూ.2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు, తద్వారా ఈ ఫోన్ ధర రూ.15,998కి తగ్గుతుంది.

మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలంటే డివైజ్ కండిషన్స్, మోడల్, బ్రాండ్ ఆధారంగా మీరు రూ.16,150 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐలో కస్టమర్ రూ.810.41 వరకు ఈఎంఐ వడ్డీ ఆదా పొందవచ్చు. నెలకు రూ.850 నుంచి ఈఎంఐ ప్రారంభమవుతుంది. కొనుగోలుదారు రూ.1,149, రూ.649లకు ప్రమాదవశాత్తు లాస్ ప్రొటెక్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా ఎంచుకోవచ్చు.

Read Also : మీకు జీతం తక్కువగా వస్తుందా? ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. లైఫ్ మొత్తం హ్యాపీగా బతికేయొచ్చు..!

పోకో ఎక్స్ 6 స్పెసిఫికేషన్లు :
పోకో X6 ఫోన్ 120hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 512 GB వరకు స్టోరేజీతో వస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 14-ఆధారిత స్కిన్‌పై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో సెన్సార్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ ఫోన్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.