Pova 8 Pro 5G Sale : గేమింగ్ ఫోన్ ఇదిగో.. కొత్త పోవా 8 ప్రో 5జీ ఫస్ట్ సేల్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Pova 8 Pro 5G Sale : టెక్నో కొత్తగా లాంచ్ చేసిన గేమింగ్ ఫోన్ పోవా 8 ప్రో 5జీ ఇప్పుడు భారత మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉంది. ఫస్ట్ సేల్‌లో, ఈ ఫోన్‌పై రూ. 3వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది.

Pova 8 Pro 5G Sale

  • భారత మార్కెట్లో పోవా 8 ప్రో 5జీ సేల్స్ ప్రారంభం
  • రూ. 3వేలు బ్యాంకు డిస్కౌంటుతో ఈ ఫోన్ మీ సొంతం
  • గేమింగ్ ఫోన్ కొనేవారికి ఇదే అద్భుతమైన ఆఫర్

Pova 8 Pro 5G Sale : కొత్త పోవో ప్రో 5జీ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో పోవా 8 ప్రో 5జీ సేల్స్ ప్రారంభమయ్యాయి. టెక్నోకు చెందిన ఈ పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్ 6500mAh బ్యాటరీతో వస్తుంది.

ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ నథింగ్ ఫోన్‌ మాదిరిగా ఉంటుంది. అదనంగా, బ్యాక్ ప్యానెల్‌లో యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే ఉంది. కంపెనీ ఫస్ట్ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ. 3వేలు డిస్కౌంట్ అందిస్తుంది. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..

పోవా 8 ప్రోపై భారీ ఆఫర్లు :
భారత మార్కెట్లో పోవా 8 ప్రో ఫోన్ 2 స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 49,999కు లభిస్తోంది. టాప్-ఎండ్ 12GB ర్యామ్ + 512GB వేరియంట్ ధర రూ. 54,999కు లభిస్తోంది. ఈ ఫోన్‌పై రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ధర రూ. 46,999కు లభిస్తోంది. ఈ టెక్నో ఫోన్ ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, టండ్రా గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది..

పోవా 8 ప్రో ఫీచర్లు :
ఈ గేమింగ్ ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 4500 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్, 144Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్ డిస్‌ప్లేలో హైపర్‌లక్స్ టెక్నాలజీని వాడింది. ఈ ఫోన్ IP69K రేటింగ్‌తో వస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.

Read Also : AI Trust Rankings : అన్ని ఏఐలనూ నమ్మొచ్చా? ది బెస్ట్ ఏఐ కంపెనీ ఇదే.. నమ్మకంలో నెంబర్ వన్

ఈ టెక్నో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్‌లో టెక్నో P1 చిప్ కూడా ఉంది. ఇందులో వేపర్ ఛాంబర్ కూలింగ్ బెనిఫిట్ అందిస్తుంది.

పోవా 8 ప్రోలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 5జీ సిమ్ కార్డులు, వై-ఫై, బ్లూటూత్, NFC ఉన్నాయి. ఇందులో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.