PUBG Ban : డోంట్ వర్రీ.. ఇండియాలో PUBG ఆడొచ్చు.. ఎలానో తెలుసా?

  • Publish Date - September 3, 2020 / 03:57 PM IST

PUBG Ban- Play PUBG In India : పబ్‌జీ.. వీడియో గేమ్ ఉన్నంతా క్రేజ్ అంతాఇంతా కాదు.. మిలియన్ల మంది గేమర్స్.. పబ్ జీ అంటే పిచ్చి అలాంటి పబ్‌జీ వీడియో గేమ్ ఇండియాలో బ్యాన్ అయింది. భారత ప్రభుత్వం చైనాకు సంబంధించిన మొత్తం 118 కొత్త యాప్స్ బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. అందులో PUBG Mobile యాప్ ఒకటి.. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరిన్ని చైనా యాప్స్‌పై నిషేధం విధించింది.



భారతదేశంలో 50 మిలియన్‌ మందికి పైగా పబ్జీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేశారు. 35 మిలియన్లకు పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. తాజాగా పబ్ జీ మొబైల్ బ్యాన్ చేయడంతో గేమర్లకు దిగులు పట్టుకుంది.. మళ్లీ పబ్ జీ ఆడలేమా? తెగ బాధపడిపోతున్నారంట..

అయితే.. పబ్ జీ ప్లేయర్లకు గుడ్ న్యూస్.. పబ్ జీ బ్యాన్ చేసినప్పటికీ ఇండియాలో వీడియో గేమ్ ఆడుకోవచ్చుంట.. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో PUBG మొబైల్, PUBG మొబైల్ Lite వెర్షన్ మాత్రమే నిషేధం విధించారు.

పేరంట్ గేమ్ PUBG సర్వర్ గేమర్ లకు ప్రభుత్వం అనుమతించింది. ఈ పబ్ జీ సర్వర్లకు ఎలాంటి చైనీస్ కనెక్షన్లు లేవు. ఇందులో PUBG Corp నిర్వహించే సర్వర్లతో రన్ అవుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ PUBG గేమర్లను ఇండియాలో ఆడుకునేందుకు అనుమతిస్తుంది. అయితే మొబైల్ ఫోన్లలో పనిచేయదు.. టాబ్లెట్లలో కూడా ఆడలేరు.. కేవలం కంప్యూటర్లలో మాత్రం PUBG వీడియో గేమ్ ఆడగలరు.. ల్యాప్ టాప్ లలో కూడా వినియోగించుకోవచ్చు.



గేమ్ PCలో మరింత ఆకట్టుకునేలా గ్రాఫిక్స్ అందిస్తోంది. కంప్యూటర్ (PC) కోసం PUBG Lite వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. వాస్తవానికి పబ్ జీని తయారు చేసింది కూడా దక్షిణ కొరియానే.. ఆ తర్వాత సౌత్‌ కొరియా నుంచి లైసెన్స్‌ పొందిన చైనా కంపెనీ Tencent పబ్జీ మొబైల్‌, పబ్జీ మొబైల్‌ లైట్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది.

ప్లే స్టోర్‌లో PUBG యాప్‌ తొలగిస్తారా? :
చైనా యాప్ టిక్‌టాక్‌ మాదిరిగానే PUBG యాప్ కూడా గూగుల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోలేరు. కేంద్రం ఆదేశాలు అందగానే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఆ యాప్‌ను తొలగిస్తారు. ఒకవేళ ఇదివరకే ఈ PUBG యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఉంటే మాత్రం.. Airtel, Jio మిగత నెట్‌ వర్క్‌లు తమ సర్వర్ల నుంచి PUBG IP అడ్రస్‌ను తొలగించాయి.. దాంతో పబ్ జీ వీడియో గేమ్‌ ఇకపై ఆడలేరు. కానీ, కంప్యూటర్, పీసీ వెర్షన్ పబ్‌జీ యాప్ మాత్రం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఆడుకోవచ్చు..