PUBG: పబ్‌జీ గేమ్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా స్మార్ట్ ఫోన్‌లకు అతుక్కుపోయి ఆడుకునే ఆట పబ్‌జీ. సౌత్ కొరియాకు చెందిన పబ్జీ కార్పొరేషన్‌కు చెందిన ఈ మొబైల్ గేమ్‌ను టెన్సెంట్ గేమ్స్ కంపెనీ నిర్వహించేది. ఇటీవల చైనా దేశం నిర్వహిస్తున్న పలు యాప్‌లను ఇండియాలో బ్యాన్ చేయడంతో వాటితో పాటే పబ్‌జీ కథ కూడా ముగిసిపోయింది.
టెక్ క్రంచ్ కథనం ప్రకారం.. దీపావళి సమయంలోనే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం పబ్‌జీ గ్లోబల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. చైనా సర్వర్ల విషయంలో మనదేశ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నందున భారతీయుల డేటా స్టోర్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మనదేశంలో పబ్‌జీ స్ట్రీమ్ చేసే హై ప్రొఫైల్ స్ట్రీమర్లకు ఈ విషయాన్ని ఇప్పటికే తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. చైనా కంపెనీ టెన్‌సెంట్‌తో కూడా పబ్‌జీ తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది. మనదేశంలో పబ్లిషింగ్ హక్కుల కోసం ఎయిర్ టెల్, పేటీయం వంటి సంస్థలతో పబ్‌జీ ప్రయత్నిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ కు చెందిన క్లౌట్ కంప్యూటింగ్ సర్వీస్ అజూర్ క్రాఫ్టన్ తో ఒప్పందం కుదుర్చుకుని పబ్‌జీని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని పబ్‌జీ మొబైల్ ప్రో మ్యాక్స్‌టెర్న్ కన్ఫామ్ చేశారు. పబ్‌జీ రద్దు అయిన తర్వాత మార్కెట్లో అందుబాటులో ఉన్న యాప్ లతో సంతృప్తి పడుతున్న వారు తిరిగి పబ్‌జీనే ఆదరిస్తారా అనేది చూడాలి మరి.