Range Rover Velar: భారతదేశంలో కొత్త రేంజ్ రోవర్ వెలార్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కొత్త రేంజ్ రోవర్ వెలార్ డైనమిక్ హెచ్‌ఎస్‌ఇలో రెండు పవర్‌ట్రైన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజన్ 184 kW శక్తిని, 365 Nm టార్క్ తో పాటు 2.0 లీటర్ల ఇంజినియం డీజిల్ ఇంజన్ 150 kW శక్తిని, 420 Nm టార్క్ ని అందజేస్తుంది.
Xtreme 200S 4V: మరింత స్టైలిస్, మరింత కొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న హీరో ఎక్స్ట్రీమ్ బైకు
కొత్త పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లతో పాటు ఆభరణం వంటి ఎఫెక్ట్ తో కూడిన సిగ్నేచర్ డేటైమ్ రన్నింగ్ లైట్‌ల పరిచయంతో రేంజ్ రోవర్ వెలార్ కొత్త ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపున, శక్తివంతమైన ఓవర్‌హ్యాంగ్ బ్యాలెన్స్ ని అందిస్తుంది. రేంజ్ రోవర్ వెలార్ కారవే, డీప్ గార్నెట్ అనే రెండు కొత్త లెదర్ రంగుల్లో అందుబాటులో ఉంది. స్టీరింగ్ వీల్‌పై కొత్త మూన్‌లైట్ క్రోమ్, సెంటర్ కన్సోల్ సరౌండ్స్, ఎయిర్ వెంట్‌లతో సహా క్యూరేటెడ్ ఎంపికతో ఇవి సంపూర్ణంగా ఉంటాయి. టాక్టిల్ షాడో గ్రే యాష్ వుడ్ వెనీర్ ట్రిమ్ ఫినిషర్స్ దాని సొగసును మరింతగా చాటిచెబుతాయి. ఎక్స్ టీరియర్ ప్యాలెట్ మెటాలిక్ వారెసిన్ బ్లూ, ప్రీమియం మెటాలిక్ జాదర్ గ్రే అనే రెండు కొత్త రంగుల్లో కూడా లభిస్తాయి.
కొత్త రేంజ్ రోవర్ వెలార్ రేపటి తరం పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉన్న మొదటి కారు. ఇది కొత్త 28.95 సెం. మీ (11.4) కర్వ్డ్ గ్లాస్ టచ్‌స్క్రీన్‌లో అన్ని కీలక వాహనాల ఫంక్షన్‌లకు నియంత్రణలను కలిగి ఉంటుంది. ఎంతో శ్రద్ధాసక్తులతో రూపుదిద్దిన రేంజ్ రోవర్ వెలార్ క్యాబిన్ మార్గదర్శక యాక్టివ్ రోడ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో కొత్త రేంజ్ రోవర్ వెలార్ క్యాబిన్‌లో అత్యంత నిశ్శబ్ద అనుభవాన్ని అందజేస్తూ, రోడ్డు శబ్దాన్ని తగ్గిస్తుంది. ప్రఖ్యాత రేంజ్ రోవర్ రైడ్ సౌలభ్యం, శుద్ధీకరణ అనేవి రేంజ్ రోవర్ వెలార్‌లో అధునాతన ఛాసిస్, సస్పెన్షన్ సెటప్‌ల ద్వారా అందించబడుతాయి. ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్ నిర్మలమైన సౌకర్యాన్ని అందిస్తుంది. అధునాతన చాసిస్ సిస్టమ్ అడా ప్టివ్ డైనమిక్స్ తో బంప్‌లను సున్నితంగా చేస్తుంది. ప్రతి చక్రం వద్ద డంపింగ్ శక్తులను అది నిరంతరం మారుస్తూ ఉంటుంది.