Realme 16T 5G : ఛార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 8,000mAh బ్యాటరీతో కొత్త రియల్‌మి 5జీ ఫోన్ రాబోతోంది..!
Realme 16T : రియల్‌మి లవర్స్ కోసం కొత్త 5జీ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో మే 22న 8,000mAh బ్యాటరీ పవర్ ఫీచర్లతో రియల్‌మి 16టీ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.
- Sreehari A
- Published on- May 12, 2026 / 07:20 PM IST
Realme 16T
- రియల్‌మి 16టీ కొత్త 5జీ ఫోన్ వచ్చే తేదీ ఇదే
- మే 22న భారత మార్కెట్లో లాంచ్ కానుంది
- బైపాస్ ఛార్జింగ్, వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు
Realme 16T : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త రియల్‌మి 16టీ 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ రియల్‌మి 16 సిరీస్ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ, లభ్యత, డిజైన్‌తో సహా అనేక కీలక వివరాలను కంపెనీ షేర్ చేసింది.
రియల్‌మి 16టీ 5జీ కోసం 2 స్పెషల్ మైక్రోసైట్‌లను క్రియేట్ చేసింది. కంపెనీ వెబ్‌సైట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో లైవ్ చేసింది. ఇప్పటికే రియల్‌మి 16, రియల్‌మి 16 ప్రో రియల్‌మి 16 ప్రో ప్లస్ మార్కెట్లోకి రాగా ఈ సిరీస్‌లో నాల్గో మోడల్ రాబోతుంది.
కంపెనీ ప్రకారం.. రియల్‌మి 16టీ 5జీ మే 22న భారత మార్కెట్లో మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. రాబోయే ఈ రియల్‌మి ఫోన్ స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్ రెడ్, బ్లూ కలర్ షేడ్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని కూడా కంపెనీ ధృవీకరించింది.
ఈ ఫోన్ భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కొత్త రియల్‌మి 16టీ 5జీలో 8,000mAh టైటాన్ బ్యాటరీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
Read Also : Amazon Great Summer Sale : టాప్ కెమెరా ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకే.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాపై అదిరే ఆఫర్..
ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. ఇందులో 14.3 గంటల గేమింగ్, 34 గంటల సోషల్ మీడియా స్క్రోలింగ్, 21.9 గంటల నావిగేషన్ అన్ని చేయొచ్చు. అంతేకాదు.. ఈ బ్యాటరీ 7 ఏళ్ల వరకు లైఫ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో బైపాస్ ఛార్జింగ్, వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉంటాయి.
డిజైన్ పరంగా చూస్తే.. :
రియల్‌మి 16టీ 5జీ ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో పాటు రెక్టాంగులర్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా ఐలాండ్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీ మిర్రర్ అమర్చి ఉన్నాయి.
అదనంగా, పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ ఫోన్ రైట్ సైడ్ ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ 8.8 మిమీ మందంతో ఉంటుంది. చిప్‌సెట్, కెమెరా కాన్ఫిగరేషన్ భారత ధరతో సహా ఇతర వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
రియల్‌మి 16టీ 5జీ ఫోన్ ఇటీవల గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై కనిపించింది. రిపోర్టుల ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంటుంది. ఇందులో గరిష్టంగా 2.4GHz క్లాక్ స్పీడ్‌తో 2 పెర్ఫార్మెన్స్ కోర్లు, 2GHz క్లాక్ స్పీడ్‌తో 6 ఎఫిషియెన్సీ కోర్లు ఉంటాయి. ఇందులో మాలి-G57 MC2 GPU, కనీసం 8GB ర్యామ్, ఆండ్రాయిడ్ 16 ఉంటాయని అంచనా.
