Realme P4 5G Series
Realme P4 5G Series : కొత్త రియల్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో రియల్‌మి P4 5G, రియల్‌మి P4 ప్రో 5G ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లలో 50MP మెయిన్ (Realme P4 5G Series) కెమెరా, భారీ 7,000mAh బ్యాటరీ కలిగి ఉన్నాయి. బేస్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంది. అయితే, రియల్‌మి ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌తో వస్తుంది.
రియల్‌మి P4 5G సిరీస్ ధర, కలర్ ఆప్షన్లు :
రియల్‌మి P4 లాంచ్ ధర రూ.18,499 ఉండగా ఈ ఫోన్ 3 వేరియంట్లలో లభిస్తుంది. 6GB+128GB రూ.18,499, 8GB+128GB రూ.19,499, 8GB+256GB రూ.21,499కు పొందవచ్చు. ఈ రియల్‌మి ఇంజిన్ బ్లూ, ఫోర్జ్ రెడ్, స్టీల్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది.
భారత మార్కెట్లో రియల్‌మి P4 ప్రో ధర రూ.24,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB+128GB ధర రూ.24,999, 8GB+256GB ధర రూ.26,999, టాప్-ఎండ్ 12GB+256GB మోడల్ రూ.28,999కు 3 కాన్ఫిగరేషన్లలో కూడా వస్తుంది.
రియల్‌మి ప్రో మోడల్ బిర్చ్ వుడ్, డార్క్ ఓక్ వుడ్, మిడ్‌నైట్ ఐవీ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ 2 మోడళ్లకు సేల్ ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ. 2వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. కొనుగోలుదారులు బజాజ్ NCE ద్వారా అదనపు సేవింగ్స్‌తో 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఎంచుకోవచ్చు.
రియల్‌మి P4లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. HDR+ సపోర్ట్ అందిస్తుంది. హుడ్ కింద 4nm ప్రాసెస్‌పై మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్ పొందవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. 7000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రియల్‌మి P4 50MP ప్రైమరీ షూటర్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. రియల్‌మి P4 విషయానికి వస్తే.. ఈ రియల్‌మి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ కలిగి ఉంది. 12GB LPDDR4X ర్యామ్, 256GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది.
రియల్‌మి P4 ప్రోలో భారీ 7000mAh బ్యాటరీని అందిస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. కెమెరాల రియల్‌మి P4 ప్రోలో 50MP సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్ OISతో 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP సెన్సార్ కలిగి ఉంది.