Realme P4 Lite : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్.. రూ. 25వేల రియల్‌మి లైట్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే.. ఎలాగంటే?
Realme P4 Lite : ఈ ఫోన్ 4GB+64GB వేరియంట్ అసలు ధర రూ. 24,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ. 13,999కే లభిస్తోంది. అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- August 29, 2026 / 06:15 PM IST
Realme P4 Lite
- ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 44శాతం తగ్గింపుతో లభిస్తోంది
- 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6300mAh బ్యాటరీ సెటప్
- 1.8GHz ఆక్టా-కోర్ యునిసోక్ T7250 12nm ప్రాసెసర్
Realme P4 Lite : కొత్త రియల్‌మి ఫోన్ కొంటున్నారా? రియల్‌మి P4 లైట్ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్.. ఈ రియల్‌మి ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్లు కూడా చాలా ఖరీదైనవిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్ అందిస్తోంది.
6300mAh బ్యాటరీతో రియల్‌మి ఫోన్ అసలు ధర కన్నా రూ. 11వేలు తక్కువకే అందిస్తోంది. ఈ ఫోన్‌లో (Realme P4 Lite) ఆక్టా-కోర్ ప్రాసెసర్ అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. రియల్‌మి P4 లైట్‌పై బెస్ట్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పడు వివరంగా పరిశీలిద్దాం..
డిస్కౌంట్ ధర ఆఫర్ :
రియల్‌మి P4 లైట్ ఫోన్ అత్యంత చౌక ధరకే కొనేసుకోవచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 44శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ 4GB+64GB వేరియంట్ అసలు ధర రూ. 24,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,999కే లభిస్తోంది.
కంపెనీ ఈ ఫోన్ అసలు ధరపై నేరుగా రూ. 11వేలు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే అదనంగా రూ. 700 సేవ్ చేసుకోవచ్చు. దాంతో ఈ ఫోన్ అసలు ధర రూ. 13,299 అవుతుంది. ఈ ఫోన్ రూ. 14 వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి P4 లైట్ ఫోన్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల HD+ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 563 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 1.8GHz ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 12nm ప్రాసెసర్, మాలి G57 ఎంపీఐ జీపీయూతో రన్ అవుతుంది. కెమెరా సెటప్‌లో ఓమ్నివిజన్ OV13B సెన్సార్, ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్ అల్ట్రా-లీనియర్ బాటమ్-పోర్టెడ్ స్పీకర్ ఉన్నాయి. ఈ రియల్‌మి ఆర్మోర్‌షెల్ ప్రొటెక్షన్ కోసం MIL STD 810H మిలిటరీ-గ్రేడ్ టెస్టింగ్ పాస్ అయింది. 6300mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్, 6W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ కొలతలు 167.2 x 76.6 x 7.94mm, బరువు 201 గ్రాములు ఉంటుంది.
