RedMagic Gaming Tablet 5 Pro : మొబైల్ గేమింగ్‌కి రారాజు.. పవర్‌ఫుల్ రెడ్‌మ్యాజిక్ టాబ్లెట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఊహించలేరంతే..!

RedMagic Gaming Tablet 5 Pro : రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా. హీట్ మేనేజ్ కోసం ఇందులో 'RGB లిక్విడ్ కూలింగ్' టెక్నాలజీ కూడా ఉంది. పూర్తి ఫీచర్లు వివరాలివే..

RedMagic Gaming Tablet 5 Pro

  • ఈ టాబ్లెట్‌లో 185Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
  • 9.06-అంగుళాల OLED ప్యానెల్‌ సెటప్
  • రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 3 ప్రోకి అప్‌గ్రేడ్

RedMagic Gaming Tablet 5 Pro : కొత్త ట్యాబ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? చైనా ఫోన్ల తయారీ సంస్థ జేటీఈ సబ్ బ్రాండ్ రెడ్‌మ్యాజిక్ ఫోన్ త్వరలో కొత్త గేమింగ్ టాబ్లెట్‌ లాంచ్ చేయనుంది. ఈ సంస్థ రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో డిజైన్ కీలక స్పెసిఫికేషన్లను ముందుగానే వెల్లడించింది. ఈ టాబ్లెట్‌లో 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండొచ్చు.

గత ఏడాదిలో రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 3 ప్రో లాంచ్ అయింది. ఇప్పుడు రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో పేరుతో జూన్ 30న చైనాలో లాంచ్ కానుంది. ఇప్పటికే ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ టాబ్లెట్‌లో 185Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 9.06-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్ ఉంటుంది.

ఈ డిస్‌ప్లేలో అప్‌గ్రేడ్ X10 లూమినెసెంట్ మెటీరియల్‌ వాడారు. డిజైన్ రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ ఉండవచ్చు. హీట్ మేనేజ్ కోసం ‘ఆర్‌జీబీ లిక్విడ్ కూలింగ్’ టెక్నాలజీని అందిస్తారు. రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయింది. గేమింగ్‌ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.85-అంగుళాల 1.5K (2,688 × 1,216 పిక్సెల్స్) ఫుల్-స్క్రీన్ డిస్‌ప్లే ఉంది.

Read Also : Redmi 17C : సూపర్ ఫోన్ బ్రో.. 5,160mAh బ్యాటరీతో కొత్త రెడ్‌మి 17C ఫోన్.. ధర చాలా తక్కువ..!

డిస్‌ప్లే స్టార్ షీల్డ్ ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ 2.0, డీసీ డిమ్మింగ్, పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, SGSలో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రెడ్‌మ్యాజిక్ OS 11.0పై రన్ అవుతుంది. ఇందులో కంపెనీ రెడ్‌కోర్ R4 గేమింగ్ చిప్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్యూబ్ స్కై ఇంజిన్ 3.0, ఇంటర్నల్ పీసీ ఎమ్యులేటర్, 520Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో షోల్డర్ ట్రిగ్గర్ బటన్ వంటి గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి. హీట్ మేనేజ్‌మెంట్ కోసం ఇందులో డ్యూయల్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, వేపర్ ఛాంబర్‌తో ఐసీఈ మ్యాజిక్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ NFC, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఫంక్షన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.