Redmi 13 5G Launch : రెడ్‌మి 13 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర కేవలం రూ 13,999 మాత్రమే..!

Redmi 13 5G Launch : రెడ్‌మి 13 5జీ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్.. వెనిలా మోడల్ ధర రూ. 13,999కు అందిస్తోంది. ఈ ఫోన్ అమెజాన్‌లో లాంచ్ కాగా అనేక డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. జూలై 12న సేల్ లైవ్ కానుంది.

Redmi 13 5G launched in India ( Image Source : Google )

Redmi 13 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సరికొత్త ఎంట్రీ-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 13 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఈ కొత్త 5జీ ఫోన్ రూ. 13,999 ప్రారంభ ధరకు రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.79-అంగుళాల డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది.

Read Also : Redmi Note 13 Pro Plus 5G : రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ వచ్చేసింది.. స్పెషిఫికేషన్లు, ధర ఎంతంటే?

గత వెర్షన్ల మాదిరిగా కొత్త ఫోన్ రెడ్‌మి 12 5జీ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఆగస్టు 2023లో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం 10 నెలల తర్వాత షావోమీ వినియోగదారులకు రూ. 15వేల లోపు అప్‌గ్రేడ్ వెర్షన్‌తో వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈ చిప్‌తో ఆధారితమైన రెడ్‌మి 13 5జీ ఫోన్, షావోమీ లేటెస్ట్ హైపర్ఓఎస్‌పై రన్ అవుతుంది.

రెడ్‌మి 13 5జీ ధర, లభ్యత :
రెడ్‌మి 13 5జీ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్.. వెనిలా మోడల్ ధర రూ. 13,999కు అందిస్తోంది. ఈ ఫోన్ అమెజాన్‌లో లాంచ్ కాగా అనేక డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. జూలై 12న సేల్ లైవ్ కానుంది. రెడ్‌మి 13 5జీ రెండు వేరియంట్లలో లాంచ్ కాగా.. వనిల్లా మోడల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, ఇతర వేరియంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ని కలిగి ఉంది. రెడ్‌మి 13 5జీ ఫోన్ మొత్తం ఓషన్ బ్లూ, పెరల్ పింక్, మిడ్నైట్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. షావోమీ కూడా రూ. వెయ్యి ఆఫ్ కార్డ్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 12,999కు అందిస్తోంది.

రెడ్‌మి 13 5జీ కీలక స్పెషిఫికేషన్లు :
రెడ్‌మి 13 5జీ గత వెర్షన్ల మాదిరిగానే అద్భుతమైన గ్లాస్ కవర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో రింగ్ లైట్ ద్వారా వస్తుంది. రాబోయే ఫోన్ డిజైన్ రెడ్‌మి 12 5జీ పోలి ఉంటుంది. రింగ్ లైట్ అనేది సరికొత్త ఫీచర్ అందిస్తోంది.

రెడ్‌మి 13 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.79-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. పంచ్-హోల్ నాచ్‌ని కూడా కలిగి ఉంది. పంచ్-హోల్ నాచ్ డిజైన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంది. ప్రాసెసర్ విషయానికి వస్తే.. రెడ్‌మి 13 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈ చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. రెడ్‌మి 12 5జీ ఉపయోగించిన అదే చిప్‌సెట్ కలిగి ఉంది.

ఎంఐయూఐ 14లో ఉన్నప్పటికీ, కొత్త మోడల్ షావోమీ లేటెస్ట్ హైపర్ఓఎస్‌తో ప్రారంభమవుతుంది. మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో బలమైన 5,030mAh బ్యాటరీని అందిస్తుంది. పవర్-అప్‌లు, ఎక్స్‌టెండెడ్ ఫీచర్లను అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెడ్‌మి 13 5జీ 2ఎంపీ సెన్సార్‌తో 108ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలకు 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.

Read Also : Redmi Note 14 Pro Launch : రెడ్‌మి నోట్ 14ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు