Redmi 13C Sale Today : రెడ్‌మి 13సి ఫోన్ సేల్ మొదలైంది.. ఎక్కడ కొనాలి? లాంచ్ ఆఫర్ల వివరాలివే..!

Redmi 13C Sale Today : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్‌మి 13సి 4జీ వేరియంట్ అమెజాన్, ఎం.కామ్, షావోమీ రిటైల్‌లో విక్రయిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ హెలియో జీ85 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

Redmi 13C Sale Today : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం. రెడ్‌మి 13సి ఫోన్ సేల్ మొదలైంది. డిసెంబర్ 13నుంచి గ్లోబల్ మార్కెట్లో సేల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. కొత్త రెడ్‌మి 13సి 4జీ స్మార్ట్‌ఫోన్ ఈరోజు అమ్మకానికి వచ్చింది. రూ. 10వేల కన్నా తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. పోకో బ్రాండింగ్ కింద కొన్ని ఇతర గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయిన తర్వాత గత వారం జరిగిన లాంచ్ ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

రెడ్‌మి 13సి స్పెసిఫికేషన్స్ :
రెడ్‌మి 13సి ఫోన్ 6.74-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో 600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 450నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్ మాలి-జీ5తో వస్తుంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 8జీబీ ర్యామ్‌తో పాటు 8జీబీ వర్చువల్ ర్యామ్ 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో-ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు.

Read Also : WhatsApp Pin Chat : వాట్సాప్‌లో కొత్త పిన్ చాట్ ఫీచర్.. ముఖ్యమైన మెసేజ్‌లను ఈజీగా పిన్ చేసుకోవచ్చు!

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెడ్‌మి 13సి 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్, మరో 2ఎంపీ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వినియోగదారుల సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి స్మార్ట్‌ఫోన్ 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనిని 18డబ్ల్యూ ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. అయితే, ఈ ఫోన్ బాక్స్‌లో 10డబ్ల్యూ ఛార్జర్‌తో మాత్రమే వస్తుంది.

Redmi 13C 90Hz display on Sale today

రెడ్‌మి 13సి ఫోన్.. కొనుగోలు చేయాలంటే? :
రెడ్‌మి 13సి 5జీ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు భారతీయ మార్కెట్లో విక్రయించనుంది. ఎం.కామ్, షావోమీ రిటైల్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి 13సి ఫోన్ 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 7,999, 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 8,999, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499కు పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి రూ. వెయ్యి తగ్గింపును పొందవచ్చు.

రెడ్‌మి 13సి 5జీ సేల్ ఎలా? :
రెడ్‌మి 13సి 5జీ ఫోన్ అదే 3 ప్లాట్‌ఫారమ్‌లలో డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 9,999, 6జీబీ ర్యామ్/128జీబీస్టోరేజ్ వేరియంట్‌కి రూ. 11,499, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ.13,499కు పొందవచ్చు.

Read Also : 2023 Year-End Discounts : హోండా కార్లపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందంటే?

ట్రెండింగ్ వార్తలు