Redmi K100 Leak : బ్యాటరీ బీస్ట్ వస్తోందోచ్.. ఈ కొత్త రెడ్‌మి K100 సిరీస్ రేంజే వేరబ్బా.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Redmi K100 Leak : రెడ్‌మి K100లో 10,000mAh బ్యాటరీ, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటాయని అంచనా. ఈ షావోమీ ఫోన్‌కు సంబంధించిన పలు ఫీచర్ల వివరాలు రివీల్ అయ్యాయి.
- Sreehari A
- Published on- September 1, 2026 / 07:15 PM IST
Redmi K100 Leak
- 10,000mAh బ్యాటరీతో రెడ్‌మి K100 సిరీస్ వస్తోంది
- భారత మార్కెట్లో పోకో X8 పవర్ రీబ్రాండెడ్ వెర్షన్
- 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్
Redmi K100 Leak : రెడ్‌మి K100 ప్రో, రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి. ఈ సిరీస్‌లో ఒక స్టాండర్డ్ మోడల్ కూడా లాంచ్ కానుంది. ఈ రెడ్‌మి ఫోన్ పవర్‌ఫుల్ 10,000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. భారత మార్కెట్లో పోకో X8 పవర్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. ఈ ఫోన్ డిజైన్ రెడ్‌మి K100 ప్రో సిరీస్ మాదిరిగా ఉండొచ్చు.
10000mAh బ్యాటరీనా? :
టిప్‌స్టర్ ప్రకారం.. రెడ్‌మి K100కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ఈ ఫోన్ 10,000mAh బ్యాటరీతో రావచ్చు. అదనంగా, 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండొచ్చు. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
ఈ రెడ్‌మి ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 5V చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఇతర ఫీచర్లపై ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ఇటీవల లాంచ్ అయిన రెడ్‌మి K100 ప్రోలో 185Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ కూడా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 5V చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
ఈ ఫోన్ 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రో మోడల్‌లో 8580mAh బ్యాటరీ ఉంది. 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP సెకండరీ కెమెరా, 8MP టెర్షియరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ రెడ్‌మి ఫోన్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతుంది.
రెడ్‌మి K100 ప్రో మాక్స్ ఫీచర్లు :
ఈ సిరీస్‌లో రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.9-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంటుంది. 16GB ర్యామ్, 1TB స్టోరేజ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఫోన్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..
ఇందులో 9070mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ కోసం 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 200MP మెయిన్ కెమెరాతో పాటు, ఫోన్ బ్యాక్ సైడ్ మరో రెండు 50MP కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP కెమెరా కూడా ఉంది.
