Redmi K100 Pro : సూపర్ ఫోన్ మావా.. కొత్త రెడ్‌మి K100 ప్రో సిరీస్ భలే ఉందిగా.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ డిటెయిల్స్!

Redmi K100 Pro : రెడ్‌మి K100 ప్రో ఫోన్ ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో LED ఫ్లాష్‌తో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. పూర్తి ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

Redmi K100 Pro

  • రెడ్‌మి K100 ప్రోలో 8,580mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా ఉంటుంది
  • 185 Hz వరకు రిఫ్రెష్ రేట్‌, 6.59-అంగుళాల డిస్‌ప్లే

Redmi K100 Pro : రెడ్‌మి లవర్స్ మీకోసమే.. షావోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మి అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ రాబోతుంది. ఈ సిరీస్‌లో రెడ్‌మి K100 ప్రో, రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్ ఉంటాయి. రెడ్‌మి K100 ప్రో కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ ముందే వెల్లడించింది.

నివేదిక ప్రకారం.. రెడ్‌మి K100 ప్రోలో 8,580mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంటుందని రెడ్‌మి వెల్లడించింది. ఈ బ్యాటరీలో 26 శాతం సిలికాన్ ఉంటుంది. ఎనర్జీ డెన్సిటీ 945Wh/Lగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, 22.5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఆగస్టు 11నే చైనాలో లాంచ్ :
రెడ్‌మి K100 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, సింగిల్ టెలిఫోటో కెమెరా కూడా ఉంటాయి. రెడ్‌మి K100 ప్రో సిరీస్ ఆగస్టు 11న చైనాలో లాంచ్ కానుంది.

Read Also : Itel Ace 3 Heera Feature Phone : రూ. 949కే కొత్త ఐటెల్ Ace 3 హీరా.. బ్లూటూత్, కాల్ రికార్డింగ్, వైర్‌లెస్ FMతో అదిరే ఫీచర్ ఫోన్!

అంతకుముందు.. రెడ్‌మి K100 ప్రో కస్టమ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5V సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్పెషల్ ఏఐ గేమింగ్ గ్రాఫిక్స్ చిప్ కూడా ఉంటుంది. రెడ్‌మి ఇంటర్నల్ టెస్ట్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ AnTuTu బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై 40,95,000 పాయింట్లకు పైగా స్కోరును పొందింది. రెడ్‌మి K100 ప్రో ‘రేజింగ్ ఇంజిన్’తో వస్తుంది.

ప్రారంభమైన ప్రీ-ఆర్డర్లు :

ఈ స్మార్ట్‌ఫోన్‌లో థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 3డీ సర్క్యులేటింగ్ కోల్డ్ పంప్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. గేమింగ్ సమయంలో హీట్ తగ్గిస్తుంది. రెడ్‌మి K100 ప్రోలో 6.59-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ 185Hz వరకు, టచ్ శాంప్లింగ్ రేట్ 4,800Hz టాప్ బ్రైట్‌నెస్ 4,500 నిట్స్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్లు చైనాలో ప్రారంభమయ్యాయి. రెడ్‌మి K100 ప్రో ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది.

ఇందులో రెక్టాంగులర్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. కెమెరా ఐలాండ్‌పై సౌండ్ బై బోస్ బ్రాండింగ్ ఉంటుంది. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ ఈ స్మార్ట్‌ఫోన్ రైట్ సైడ్ ఉన్నాయి.

ఈ సిరీస్‌లో రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్‌లో 6.9-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 9,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు.