Redmi M100 Launch : 7900mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్‌తో కొత్త రెడ్‌మి M100 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతంటే?

Redmi M100 Launch : రెడ్‌మి లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. 7900mAh బ్యాటరీ 45W ఛార్జింగ్‌తో ఆకట్టుకుంటోంది. ఈ కొత్త రెడ్‌మి M100 ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

Redmi M100 Launch

  • 1600 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్టు
  • ప్రాసెసర్‌గా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్
  • 13MP మెయిన్ కెమెరా, 6.9-అంగుళాల LCD డిస్‌ప్లే

Redmi M100 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్‌మి నుంచి M100 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. ఈ ఫోన్‌లో 1600 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఇందులో 7,900mAh బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వైల్డర్‌నెస్ గ్రీన్ వేరియంట్‌లో ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ధర ఎంతంటే? :
ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, స్టార్రీ వైట్ వైల్డర్‌నెస్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రెడ్‌మి M100 ఫోన్ 8GB+128GB వేరియంట్ ధర 1,799 యువాన్లు (సుమారుగా రూ. 25,500) ఉండగా, 6GB+256GB మోడల్ ధర 1,999 యువాన్లు (సుమారుగా రూ. 28,300)కు అందిస్తుంది. టాప్-ఎండ్ 8GB+256GB వేరియంట్ ధర 2,199 యువాన్లు (సుమారుగా రూ. 31,200)కు లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రెడ్‌మి M100 ఫోన్‌లో 6.9-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. బ్యాక్ సైడ్ 4-డైమెన్షనల్ మైక్రో-కర్వ్డ్ డిజైన్‌ ఉండగా, కెమెరా ప్రాంతంలో RGB డైనమిక్ లైటింగ్ అందించారు. 1600 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది.

Read Also : Nothing Phone 4a : వారెవ్వా.. ఈ నథింగ్ ఇంతకన్నా తక్కువ ధరకు దొరకదు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇందులో ఐ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ప్రాసెసర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్ అందిస్తుంది. 4nm ప్రాసెసింగ్‌పై ఆక్టా-కోర్ చిప్‌సెట్, బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా అమర్చారు.

ఇందులో ఫిల్మ్ ఫిల్టర్లు, పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, లైవ్ ఫొటోలు, డాక్యుమెంట్ స్కానింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 5MP సెన్సార్ కాగా, బ్యూటీ మోడ్, ఫేస్ రికగ్నిషన్, పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్ ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ రెడ్‌మి ఫోన్‌లో 7,900mAh భారీ బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో PPS ఛార్జింగ్ ప్రోటోకాల్‌కు సపోర్టు అందిస్తుంది. అవసరమైతే థర్డ్-పార్టీ ఫాస్ట్ ఛార్జర్‌ కూడా వాడుకోవచ్చు. ఈ ఫోన్ సపోర్టు చేసే ఇతర ఫీచర్లలో NFC ఫీచర్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.