Redmi Note 13 5G : బిగ్ డిస్కౌంట్ బ్రో.. 108MP కెమెరాతో రెడ్‌మి 5G ఫోన్.. జస్ట్ రూ. 6వేలు తక్కువకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!
Redmi Note 13 5G : రెడ్‌మి నోట్ 13 5జీ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఏకంగా రూ. 6వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published on- April 24, 2026 / 06:06 PM IST
Redmi Note 13 5G
- రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ భారీ తగ్గింపు ఆఫర్
- 108MP మెయిన్ కెమెరా, 12GB వరకు ర్యామ్ సపోర్ట్
- 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ ఆప్షన్
Redmi Note 13 5G : కొత్త రెడ్‌మి ఫోన్ కొంటున్నారా? ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. షావోమీ పాపులర్ రెడ్‌మి ఫోన్ అతి చౌకైన ధరకే అందిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై 26శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌లో 108MP రియర్ మెయిన్ కెమెరా ఉంది. 12GB వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. ఇందులో మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ బెస్ట్ ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్‌మి నోట్ 13 5జీ డిస్కౌంట్, ధర ఆఫర్ :
రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ అతి తక్కువ ధరకు లభిస్తోంది. క్రోమాలో ఈ ఫోన్ 26శాతం తగ్గింపుతో లభిస్తోంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999 కాగా, క్రోమాలో మాత్రం రూ. 14,999కే లభిస్తోంది. అలాగే, కంపెనీ ఈ ఫోన్‌పై నేరుగా రూ. 6వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఫోన్ ఇదే తగ్గింపు ధరకు లభిస్తోంది. ఫైనల్ తగ్గింపు ధర రూ.14,500 వరకు కొనేసుకోవచ్చు.
రెడ్‌మి నోట్ 13 5జీ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌తో రన్ అవుతుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
రెడ్‌మి నోట్ 13 5జీలో 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.
రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్, 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14తో ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది.
