Nothing Phone 3 : భలే డిస్కౌంట్ బ్రో.. రూ. 80వేల నథింగ్ ఫోన్ 3 అమెజాన్‌లో జస్ట్ రూ. 51,999కే..
Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సందర్భంగా ఈ నథింగ్ ఫోన్ రూ. 28వేలు తగ్గింపుతో లభిస్తోంది. అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Nothing Phone 3 Discount
- అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3పై భారీగా తగ్గింపు
- బ్యాంకు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ఎక్స్ఛేంజ్ డీల్స్
- 120Hz అమోల్డ్ డిస్ప్లే, 5,500mAh బ్యాటరీ
Nothing Phone 3 : నథింగ్ ఫోన్ లవర్స్ మీకోసమే.. నథింగ్ ఫోన్ 3 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. భారత మార్కెట్లో రూ. 79,999 ధరకు లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. కొనుగోలుదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో పాటు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
తద్వారా డివైస్ అసలు ధరను మరింత తగ్గించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత కారణంగా అన్ని బ్రాండ్లు స్మార్ట్ఫోన్ల (Nothing Phone 3) ధరలను భారీగా పెంచుతున్న తరుణంలో నథింగ్ ఫోన్ 3 ధర తగ్గింది. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
నథింగ్ ఫోన్ 3 అమెజాన్ డీల్ :
నథింగ్ ఫోన్ 3 రూ. 79,999 ధరతో లాంచ్ చేసింది. కానీ, ప్రస్తుతం ఈ నథింగ్ ఫోన్ రూ. 51,999కే లభ్యమవుతోంది. ప్రారంభ ధరపై రూ. 28వేలు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అమెజాన్ పే ఖాతాపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు ప్రైమ్ మెంబర్ కాకుంటే క్యాష్‌బ్యాక్ 3 శాతానికి తగ్గుతుంది.
ఈ-కామర్స్ బ్రాండ్ నెలకు రూ. 1,828 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందిస్తోంది. కొనుగోలుదారులు తమ పాత ఫోన్ రూ. 19వేల వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే, నథింగ్ ఫోన్ ఫైనల్ ఎక్స్చేంజ్ వాల్యూ మీ పాత ఫోన్, బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది.
నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే.. ఈ నథింగ్ ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. HDR10+కు కూడా సపోర్ట్ చేస్తుంది. 4,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ను అందిస్తుంది.
కెమెరా ప్రియుల కోసం ఈ నథింగ్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్,50MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్-ఫేసింగ్ లెన్స్ కూడా అందిస్తుంది. ఇందులో 65W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500 mAh బ్యాటరీ కూడా ఉంది.
మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే నథింగ్ ఫోన్ 3 కొనేసుకోవడమే బెటర్.. ప్రస్తుతం ఈ నథింగ్ ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పూర్తి ఆఫర్లు, ధరపై ఓసారి లుక్కేయండి..
